Rajinikanth Kamal Haasan Multistarrer Movie: తమిళ్ సినిమా ఇండస్ట్రీకి రెండు కండ్లుగా చెప్పుకునే రజనీకాంత్ కమల్ హాసన్ లు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సైతం తమ సత్తా చాటారు. తమిళంలో రిలీజైన ప్రతి సినిమాని తెలుగులో రిలీజ్ చేసి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ప్రస్తుతం వాళ్ళిద్దరు అటు తమిళ్, ఇటు తెలుగు రెండు భాషల్లో కూడా స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళ కాంబినేషన్లో ఒక సినిమా వస్తే చూడాలని ప్రేక్షకులందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ అది ఇప్పటివరకు వర్కౌట్ కాలేదు. డైరెక్టర్ నెల్సన్ దర్శకత్వంలో వీళ్ళిద్దరు కలిసి ఒక సినిమాలో చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరో ఎవరు? విలన్ ఎవరు? అనే విషయలోం ఇంకా సరైన క్లారిటి రాలేదు. కానీ మొత్తానికైతే ఈ సినిమాని అనుకున్న రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కించడానికి దర్శకుడు సిద్ధమయ్యాడు.
ఇక దానికి తోడుగా ఈ సినిమాలో మరో ఇద్దరు స్టార్ హీరోలను సైతం భాగం చేయడానికి చూస్తున్నారట. ఇంతకీ వాళ్లెవరూ అంటే మలయాళం సినిమా ఇండస్ట్రీలో ఉన్న మోహన్ లాల్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా వెలుగొందుతున్న చిరంజీవిని ఇందులో భాగం చేయాలని చూస్తున్నారట.
ఈ నలుగురు లెజెండ్స్ కలిసి ఒకే స్క్రీన్ లో కనిపిస్తే మాత్రం థియేటర్లు తగలబడి పోతాయంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తుండటం విశేషం… నిజానికి వీళ్ళ నలుగురిని కనక కలిపినట్లయితే ఈ సినిమా పాన్ ఇండియాలో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తుంది. కొంచెం పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కూడా ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
ఇక నెల్సన్ కమర్షియల్ సినిమాలను చాలా పర్ఫెక్ట్ టెంపో లో చేస్తుంటాడు. కాబట్టి వాళ్ళిద్దర్నీ తన సినిమాలో బాగా వాడుతాడనే ఒక కాన్ఫిడెన్స్ ను సైతం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫైనల్ గా ఈ సినిమా ఎలా ఉంది? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అనే విషయాలు తెలియాలంటే ఇంకొన్ని రోజుల పాటు వెయిట్ చేయాల్సిందే…
