NTR: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన మెకోవర్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ చాలా వరకు కసరత్తులైతే చేస్తున్నాడు. గతంలో ఆయన చాలా వీక్ గా అయిపోయి కూడా చాలా డల్ గా కనిపించిన జూనియర్ ఎన్టీఆర్ ఆ లుక్ లో ఏమాత్రం ఎఫెక్టుగా అనిపించలేదు. దాంతో ప్రశాంత్ నీల్ అతనికి మరో లుక్కుని సజెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. గత నెల రోజుల నుంచి ఆ పనిలోనే ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ శరీరాకృతి పూర్తిగా మార్చుకున్నట్టుగా తెలుస్తుంది…
జిమ్ములో విపరీతంగా కసరత్తులు చేసి శరీరాకృతి ని పూర్తిగా మార్చేసుకున్నాడు. కండలు తిరిగిన దేహంతో ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్నాడు. మొత్తానికైతే జిమ్ లో తన బ్యాక్ నుంచి తీసిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఏది ఏమైనా కూడా ఎన్టీఆర్ ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించాల్సిన అవసరమైతే ఉంది…
ఇక ఇప్పటికే తన తోటి హీరోలందరు పాన్ ఇండియాలో పెను ప్రభంజనాలను సృష్టిస్తూ ముందుకు సాగుతున్నారు…ఇక ఇప్పటి వరకు డ్రాగన్ సినిమాకు సంబంధించిన ఒక్క అప్డేట్ ను కూడా ఇవ్వడం లేదు. కానీ ఈ సినిమా మీద అంచనాలను మాత్రం భారీగా పెంచేస్తున్నారు…ఈ మూవీతో ఎన్టీఆర్ 2000 కోట్ల మార్క్ ను అందుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇక ప్రశాంత్ నీల్ సైతం ఎన్టీఆర్ ను లుక్స్ పరంగా చాలా డిఫరెంట్ గా చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాడు…ఇక ఎన్టీఆర్ అప్పటికే రెండు మూడు మెకోవర్స్ లను ట్రై చేశాడు. కాబట్టి ఇప్పుడు మరోసారి డిఫరెంట్ లుక్ ను ట్రై చేస్తుండటం విశేషం…ఇక ఆయన ఏది చేసిన కూడా ఫైనల్ గా ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉంటే బాగుంటుంది…
