Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. వారణాసి సినిమాతో తన ఇమేజ్ ను అమాంతం పెంచుకోవాలనే ప్రయత్నం చేసి పాన్ వరల్డ్ లో సైతం తన సత్తా చాటి ప్రపంచ స్థాయి ప్రేక్షకులను తన వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన నుంచి వస్తున్న సినిమాల విషయంలో తను చాలా జాగ్రత్తగా ఉండాలని చూస్తున్నాడు. వారణాసి సినిమా తర్వాత ఆయన కొంతమంది దర్శకులతో సినిమాలు చేయడానికి కమిటవ్వ బోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మహేష్ తన తర్వాత సినిమాలను అనౌన్స్ చేసేంతవరకు ఈ విషయాలను చాలా గోప్యంగా ఉంచాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యంగా మహేష్ బాబు కి ఎలాంటి కథలైతే సెట్ అవుతాయో అతని అభిమానులు తన నుంచి ఏం కోరుకుంటున్నారు తన సినిమాలో ఏదైతే కావాలనుకుంటున్నారో అలాంటి కథని మహేష్ బాబు చేత చేయించాలనే ఉద్దేశ్యంతో మహేష్ భార్య నమ్రత కథలను సెలెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలు పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కబోతుంది. కాబట్టి ఇకమీదట ఆయన నుంచి రాబోయే కథలన్ని ప్రపంచ స్థాయి ప్రేక్షకులను అలరించే రేంజ్ లో ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ‘వారణాసి’ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
ఇక ఇదిలా ఉంటే గతంలో మహేష్ బాబు చేసిన మూడు సినిమాల ఒకే కథతో తెరకెక్కయంటూ భారీ విమర్శలైతే ఎదుర్కొన్నాడు. శ్రీమంతుడు, భరత్ అను నేను, మహర్షి ఈ మూడు సినిమాల్లో మహేష్ బాబు గెటప్ ఒకే రకంగా ఉండడం చూసిన ప్రేక్షకులు మూడు సినిమాలు ఒకే కథతో వచ్చాయని అనుకున్నారు.
నిజానికి మూడు కథలు వేరే అయినప్పటికి అందులో వేరియేషన్స్ చూపించకపోవడం వల్ల ఈ మూడు కథలు ఒకేలా ఉన్నాయని అందరు అనుకున్నారు. కాబట్టి ఈ సినిమా రిలీజ్ కి మరో సంవత్సర కాలం పట్టబోతుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి తనకంటూ ఒక భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో మహేష్ బాబు ఉన్నాడు.
కాబట్టి ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నాడు. ఇక ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధించబోతున్నాడు తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవ్వబోతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరో సంవత్సరం పాటు వెయిట్ చేయాల్సిన అవసరమైతే ఉంది…
