Rajinikanth: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. మొదటినుంచి కూడా ఆయన తమిళ్లో చేసిన సినిమాలన్నీ తెలుగులో డబ్ అవుతూ తెలుగు ప్రేక్షకులను కూడా విశేషంగా అలరించాయి. తద్వారా ఆయనకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మన స్టార్ హీరోలతో పాటు పోటీపడేంత క్రేజ్ అయితే ఉంది. అంతటి మార్కెట్ ని కూడా సంపాదించుకున్నాడు… ప్రస్తుతం 70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా ఆయన ఎనలేని గుర్తింపును సంపాదించుకుంటూ వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు అంటే మామూలు విషయం కాదు. రజినీకాంత్ లాంటి స్టార్ హీరో ఇప్పటికి సోలో హీరోగా రాణిస్తూ వందల కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొడుతున్నాడు.
‘జైలర్ 2’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. రజనీకాంత్ ప్రస్తుతం సినిమాల మీద సినిమాలు కమిట్ అవుతున్నాడు. ఇక ఆ సినిమాలన్నింటిని ఎప్పుడు కంప్లీట్ చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఆయనకు కొంచెం ఆరోగ్య పరిస్థితిలు కూడా సహకరించడం లేదంటూ తన పర్సనల్ వైద్యులు సైతం చెబుతున్నారు.
ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం కమల్ హాసన్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన లోకేష్ కనకరాజు తో మరో సినిమా చేయడానికి సన్నాహాలైతే చేసుకుంటున్నాడు. ఇక వీళ్ళతో పాటుగా మరొక ఇద్దరు కొత్త దర్శకులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలైతే వస్తున్నాయి. ఇక వీటన్నింటి విషయంలో ఆయన సరైన క్లారిటీని మెయింటైన్ చేయాల్సిన అవసరమైతే ఉంది.
ఎందుకంటే ఆయన రిస్క్ తీసుకునే పరిస్థితి లేదు. అతనికి ఏజ్ పెరిగిపోతుంది కాబట్టి ఈ సమయంలో ఆయన ఆచితూచి ముందుకు అడుగులు వేయాల్సిన అవసరమైతే ఉంది…ఇక వాటిని బ్యాలెన్స్ చేస్తూ సినిమాలను ఏ విధంగా చేస్తాడు తద్వారా ఆయనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది… ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన సక్సెస్ లు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి…