spot_img
Homeఎంటర్టైన్మెంట్Spirit Prakash Raj: సందీప్ వంగ తో విబేధాలు..'స్పిరిట్' నుండి ప్రకాష్ రాజ్ వాకౌట్..అసలు ఏమైందంటే!

Spirit Prakash Raj: సందీప్ వంగ తో విబేధాలు..’స్పిరిట్’ నుండి ప్రకాష్ రాజ్ వాకౌట్..అసలు ఏమైందంటే!

Spirit Prakash Raj: దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ అత్యంత ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఒకటి ‘స్పిరిట్'(Spirit Movie). సందీప్ వంగ(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటిస్తున్న సినిమా కావడం తో ఈ చిత్రం పై అంచనాలు మొదటి నుండి తారా స్థాయిలోనే ఉండేవి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఫస్ట్ లుక్ ఉండడంతో అభిమానులు మెంటలెక్కిపోయారు. ప్రభాస్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ని సందీప్ వంగ మేకింగ్ స్టైల్ లో చూడడమే ఒక విజువల్ ఫీస్ట్ అనే విధంగా ఫస్ట్ లుక్ ఉంది. అయితే ఈ సినిమాలో నటించే నటీనటులతో ఎందుకో సందీప్ వంగకు సఖ్యత కుదరడం లేదని తెలుస్తోంది. ముందుగా ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం దీపికా పడుకొనే(Deepika Padukone) ని సంప్రదించారు. ఆమె స్టోరీ మొత్తం విన్న తర్వాత పెట్టిన షరతులు చూసి, ఆమెని పక్కన పెట్టి త్రిప్తి దిమిరి(Tripti Dimiri) ని ఎంచుకున్నాడు సందీప్ వంగ.

అయితే ఇక్కడ ఏది కూడా స్మూత్ గా జరగలేదు, దీపికా పడుకొనే తనని కాదని వేరే హీరోయిన్ ని తీసుకున్నందుకు, స్పిరిట్ మూవీ స్టోరీ ని తన పీఆర్ టీం తో లీక్ చేయించిందని, ఇది చాలా చీప్ పనులు అంటూ సందీప్ వంగ నేరుగా ట్విట్టర్ వేదికపై దీపికా పడుకొనే పై మండిపడ్డాడు. ఇప్పుడు ఇదే తరహాలో ఆయన ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj) తో విభేదించాడని, దీంతో ప్రకాష్ రాజ్ కోపంతో ఈ చిత్రం నుండి వాకౌట్ అయ్యాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసలు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ పై కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించాడు. ఫస్ట్ లుక్ విడుదలకు ముందు గత ఏడాది అక్టోబర్ నెలలో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఒక చిన్న ఆడియో టీజర్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో ప్రకాష్ రాజ్ గొంతు ని కూడా మనం వినొచ్చు.

ఇందులో ఆయన జైలర్ క్యారెక్టర్ చేస్తున్నాడు. అయితే సందీప్ రెడ్డి వంగ ఆలోచనలన్నీ చాలా బోల్డ్ గా ఉంటాయి. కాబట్టి ఆయనతో ఎదో ఒక సన్నివేశం చిత్రీకరణ సమయంలో ప్రకాష్ రాజ్ తో అభిప్రాయా భేదాలు వచ్చాయట. అందుకే ఆయన వాకౌట్ అయ్యినట్టు తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ కి ఇలా వాకౌట్ అవ్వడం కొత్తేమి కాదు. గతంలో ఎన్నో సినిమాలకు ఆయన ఇలా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈమధ్య కాలంలో అలాంటివి జరగలేదు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ తో విభేదించినప్పటికీ, ఆయనతో కలిసి ‘ఓజీ’ చిత్రంలో నటించాడు ప్రకాష్ రాజ్. అంతలా మారిన ప్రకాష్ రాజ్, ఇప్పుడు ‘స్పిరిట్’ లాంటి క్రేజీ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం గమనార్హం. ఇప్పుడు ప్రకాష్ రాజ్ స్థానంలోకి ఎవరు వస్తారో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version