Prabhas Fauji Movie Delay Reasons: పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేస్తున్న నటులు చాలామంది ఉన్నారు. అందులో ప్రభాస్ మొదటి స్థానంలో ఉన్నాడు. గత కొన్ని దశాబ్దాల నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ రేంజ్ లో ముందుకు దూసుకెళ్తుంది. కానీ ఎప్పుడైతే బాహుబలి సినిమా వచ్చిందో అప్పటినుంచి ప్రభాస్ తన మార్క్ ను చూపిస్తూ ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకున్నాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ హీరోగా చేస్తున్న ఫౌజీ సినిమాను చేస్తున్నాడు. గంగను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రభాస్ అసంతృప్తి తో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ అయింది. ఇంకా ఇప్పటివరకు పూర్తవ్వలేదు. దర్శకుడు ఈ సినిమాని చెక్కుతున్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఈ సినిమా నుంచి కూడా ఒక ఫస్ట్ లుక్ గాని, టీజర్ గాని ఏదీ రాకపోవడంతో ప్రేక్షకులు అలాగే ప్రభాస్ అభిమానులు సైతం తీవ్రమైన నిరాశను వ్యక్తం చేస్తున్నారు. హను రాఘవపూడి సినిమాల్లో లవ్ స్టోరీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంతకుముందు వచ్చిన సీతా రామం సినిమాతో అటు ప్రేమ కథని ఇటు అయి ఎపిసోడ్స్ ని చాలా బ్యాలెన్స్ గా తీశాడు అలానా ఈ మూవీని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నాడట.
ఇక ఈ కథ ఆ కథ రెండు డిఫరెంట్ వేరియేషన్స్ లో ఉన్నప్పటికి సేమ్ పాటర్న్ లో సినిమాని తెరకెక్కించి సక్సెస్ ని సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఈ సినిమా ఈ సంవత్సరం రిలీజ్ అవుతుందా లేదా అనేది కూడా క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ప్రభాస్ ఇప్పటికే ఈ సంవత్సరం రాజాసాబ్ మూవీతో ముందుకు వచ్చాడు.
కాబట్టి ఈ సంవత్సర ఎండింగ్ కల్లా ఈ సినిమాని రిలీజ్ చేస్తే బాగుంటుందని తన అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు…ఈ మూవీ దర్శక నిర్మాతలు ఈ విషయం మీద ఏదైనా క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఇప్పటివరకు ఈ సినిమా గురించి అసలు ఎక్కడ అప్డేట్ కూడా ఇవ్వడం లేదు. దీనివల్ల సినిమా మీద హైప్ తగ్గే అవకాశాలైతే ఉన్నాయి…