Pooja Hegde: స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో రానున్న సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన పూజా హెగ్డేను హీరోయిన్ గా ఫైనల్ చేశాక, పైగా పోస్టర్ కూడా అధికారికంగా రిలీజ్ చేశాక, చివరకు పూజా హెగ్డే ప్లేస్ లో సమంతను హీరోయిన్ గా తీసుకున్నారు అంటూ పుకార్లు వచ్చాయి. ఈ పుకార్ల పై చిత్రబృందం కూడా క్లారిటీ ఇవ్వలేదు. దాంతో పూజా హెగ్డే ఈ విషయంలో బాగా ఫీల్ అయిందట.

ఎందుకంటే.. ‘మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమా’ పాన్ ఇండియా సినిమా… బడ్జెట్ ఎక్కువ, అందుకే రెమ్యునరేషన్ ను కూడా డిమాండ్ చేయకుండా పూజా హెగ్డే ఈ సినిమా చేయడానికి ఒప్పుకుంది. కానీ, తన పై ఇలా ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తుంటే.. ఎందుకు ఖండించలేదు అంటూ పూజా హెగ్డే త్రివిక్రమ్ ను అడిగిందట. మొత్తమ్మీద ఈ విషయం పై త్రివిక్రమ్ మీడియా వాళ్లకు క్లారిటీ ఇచ్చాడు.
Also Read: రెమ్యునరేషన్ విషయంలో నో కాంప్రమైజ్ !
మా సినిమాలో పూజా హెగ్డేనే హీరోయిన్, సమంత నటించడం లేదు అని స్పష్టం చేశాడు. మొత్తానికి సమంత నాగ చైతన్యతో విడిపోయిన దగ్గర నుంచి చాలా ఒత్తిడికి గురి అయింది. ఇక ఆ ఒత్తిడిలో నుంచి బయట పడటానికి, మళ్ళీ హీరోయిన్ గా బిజీ అయ్యేందుకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. అవకాశాల కోసం మళ్ళీ ఎంతగానో కష్ట పడుతోంది.
ఈ క్రమంలో ఆమెకు త్రివిక్రమ్ ఛాన్స్ ఇచ్చాడు అనగానే అందరూ నమ్మేశారు. కానీ, చివరకు ఆమెను హీరోయిన్ గా తీసుకోలేదు అని తేలిపోయింది. మరి త్రివిక్రమ్ ఆమె కోసం మరో పాత్ర ఏదైనా క్రియేట్ చేస్తాడేమో చూడాలి. మహేష్ సినిమా చేస్తే.. సమంతకు మళ్ళీ బ్రేక్ వస్తోంది. అలాగే మళ్ళీ సామ్ ఫామ్ లోకి వస్తోంది. మరి సామ్ కి త్రివిక్రమ్ ఛాన్స్ ఇస్తాడా ?
ఇక మహేష్ – త్రివిక్రమ్ కలయికలో ఈ సినిమాని ‘పాన్ ఇండియా సినిమా’గా తీసుకురాబోతున్నారు. పైగా ఇటు త్రివిక్రమ్ అటు మహేష్ ఇద్దరూ ఫుల్ సక్సెస్ ట్రాక్ లో ఉన్నారు.
Also Read: మళ్ళీ చిన్న చిత్రాల చూపు ఓటీటీల వైపే !