Pallavi Prashanth – Shivaji : బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ డూపర్ హిట్. షో ముగిసి దాదాపు రెండు నెలలు అవుతుంది. ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్స్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా స్పై బ్యాచ్, స్పా బ్యాచ్ లకు వేరే లెవెల్ లో ఫ్యాన్ బేస్ ఏర్పడింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తరచూ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తున్నారు. కాగా పల్లవి ప్రశాంత్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది. గురువు శివాజీ, పల్లవి ప్రశాంత్ కి ఓ సలహా ఇచ్చాడు. దీని సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.
బిగ్ బాస్ హౌస్ లో శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్ లు ఒక జట్టుగా ఆడారు. ముఖ్యంగా ఈ ముగ్గురి కాంబినేషన్ ని ప్రేక్షకులు బాగా ఇష్టపడేవారు.సోషల్ మీడియాలో స్పై బ్యాచ్ కి సెపరేట్ అభిమాన గణం ఏర్పడింది. కాగా చాలా రోజుల తర్వాత శివాజీ, ప్రశాంత్, యావర్ ఒక స్టేజి పై కనిపించి సందడి చేశారు. బీబీ ఉత్సవం పేరుతో స్టార్ మా లో ప్రసారం కానున్న స్పెషల్ ఈవెంట్ లో సీజన్ 7 కంటెస్టెంట్స్ అందరూ పాల్గొన్నారు.
దీనికి సంబంధించిన షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది. కాగా షూటింగ్ గ్యాప్ శివాజీ, పల్లవి ప్రశాంత్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ప్రశాంత్ ని శివాజీ ప్రేమగా గుండెలకు హత్తుకున్నాడు. ఏం రా ప్రశాంత్ నువ్వు పెద్ద ఎమ్మెల్యే అయిపోయావురా .. నిన్ను కలవడమే కష్టం అయిపోయింది. ఇంతకీ ఏ పార్టీ .. కాంగ్రెస్సా లేక బిఆర్ఎస్సా. ఏదొక పార్టీలో త్వరగా జాయిన్ అయిపో, లేదంటే .. సొంతంగా పార్టీ పెట్టుకో, అని సరదాగా అన్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. గురువు శివాజీ ఏం చెప్పినా పాటించే ప్రశాంత్… ఆ దిశగా అడుగులు వేసే అవకాశం లేకపోలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మరోవైపు బీబీ ఉత్సవం ఎంటర్టైనింగ్ గా ఉంటుందని ప్రోమో చూశాక అర్థం అవుతుంది. మాజీ కంటెస్టెంట్స్ అంతా ఒక చోట చేరారు. డాన్సులు, ఆటలు, పాటలతో సందడి చేశారు. రతిక తో కలిసి పల్లవి ప్రశాంత్ ‘ఉట్టిమీద కూడు’ సాంగ్ కి స్టెప్పులు వేయడం హైలెట్ గా నిలిచింది. యూట్యూబ్ సెన్సేషన్ గా మారిన కుమారి ఆంటీ గెస్ట్ గా రావడం మరో విశేషం. బీబీ ఉత్సవం ప్రోమో ఈవెంట్ పై అంచనాలు పెంచేసింది.