https://oktelugu.com/

NBK 109 update : ఎన్బీకే 109 అప్డేట్.. ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్, కమల్ హాసన్ రేంజ్ లో బాలయ్య!

ఇదే తరహాలో బాలకృష్ణ ఎన్బీకే 109లో పలు గెటప్స్ లో కనిపిస్తారంటూ ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

Written By: , Updated On : November 1, 2023 / 08:10 PM IST
Follow us on

NBK 109 update : బాలకృష్ణకు గోల్డెన్ టైం నడుస్తుంది. గత రెండు దశాబ్దాల్లో బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చింది లేదు. ఒక హిట్ కొడితే వరుసగా మూడు నాలుగు ప్లాప్స్ పడేవి. అలాంటిది హ్యాట్రిక్ నమోదు చేశాడు. బాలయ్య నటించిన అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి హిట్ స్టేటస్ అందుకున్నాయి. అఖండ ముందు వరకు బాలయ్య పరిస్థితి దారుణంగా ఉంది. పది కోట్ల వసూళ్లు కష్టం అన్న స్థాయికి మార్కెట్ పడిపోయింది. ఆ సమయంలో బోయపాటి శ్రీను ఆదుకున్నాడు. మరోసారి నమ్మకం నిలబడుతూ బాలయ్యతో హ్యాట్రిక్ హిట్ కొట్టి చూపించాడు.

ఇక సంక్రాంతి బరిలో నిలిచిన వీరసింహారెడ్డి, దసరా కానుకగా విడుదలైన భగవంత్ కేసరి మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నాయి. అయితే పండగ మూడ్ కలసి రావడంతో హిట్ మెట్టు ఎక్కాయి. ఎలాగైతే ఏమీ బాలయ్యకు వరుస విజయాలు దక్కాయి. ప్రస్తుతం ఆయన భగవంత్ కేసరి సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. భగవంత్ కేసరి వరల్డ్ వైడ్ రూ. 60 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. యూఎస్ లో వన్ మిలియన్ వసూళ్లు దాటింది.

నెక్స్ట్ బాలకృష్ణ దర్శకుడు బాబీతో కమిట్ అయిన విషయం తెలిసిందే. NBK 109 కాన్సెప్ట్ పోస్టర్ కూడా విడుదల చేశారు.ఒక పాత ఇనుప పెట్టెలో మందు బాటిల్ తో పాటు మారణాయుధాలు ఉన్నాయి. బాలయ్య పాత్ర చాలా వైల్డ్ అండ్ అగ్రెసివ్ గా ఉంటుందని ఆ కాన్సెప్ట్ పోస్టర్ చూస్తే అర్థం అవుతుంది. ఈ సినిమాకు సంబంధించి ఓ మైండ్ బ్లోయింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అదేమిటంటే… బాలయ్య వివిధ గెటప్స్ లో కనిపించనున్నాడట.

ఒక సినిమాలో భిన్నమైన గెటప్స్ ట్రై చేయడంలో కమల్ హాసన్, విక్రమ్ లాంటి నటులు పేరుగాంచారు. అక్కినేని నాగేశ్వరరావు కూడా నవరాత్రి మూవీలో 9 పాత్రలు చేశారు. కమల్ హాసన్ అత్యధికంగా దశావతారం మూవీలో 10 పాత్రలు చేశారు. ఇదే తరహాలో బాలకృష్ణ ఎన్బీకే 109లో పలు గెటప్స్ లో కనిపిస్తారంటూ ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.