https://oktelugu.com/

నితిన్‌కు విలన్‌గా నయనతార.. సాధ్యమేనా?

రీసెంట్‌గా పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడైన‌ యువ హీరో నితిన్‌ రెడ్డి ప్రొఫెషనల్‌ లైఫ్‌లో యమ స్పీడుగా ఉన్నాడు. ఈ మధ్య వరుసగా సినిమాలు చేస్తున్నాడు. భిన్న కథలతో వేగంగా ప్రాజెక్టులు ఒప్పుకుంటున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ‘భీష్మ’తో బ్లాక్ బాస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ‘రంగ్‌దే’ చిత్రంలో నటిస్తున్నాడు. దీనికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. కీర్తి సురేశ్ ఇందులో హీరోయిన్. నితిన్‌ పెళ్లి రోజు కానుకగా వచ్చిన టీజర్ చాలా ఇంట్రస్టింగ్‌ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 5, 2020 / 09:01 PM IST
    Follow us on


    రీసెంట్‌గా పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడైన‌ యువ హీరో నితిన్‌ రెడ్డి ప్రొఫెషనల్‌ లైఫ్‌లో యమ స్పీడుగా ఉన్నాడు. ఈ మధ్య వరుసగా సినిమాలు చేస్తున్నాడు. భిన్న కథలతో వేగంగా ప్రాజెక్టులు ఒప్పుకుంటున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ‘భీష్మ’తో బ్లాక్ బాస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ‘రంగ్‌దే’ చిత్రంలో నటిస్తున్నాడు. దీనికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. కీర్తి సురేశ్ ఇందులో హీరోయిన్. నితిన్‌ పెళ్లి రోజు కానుకగా వచ్చిన టీజర్ చాలా ఇంట్రస్టింగ్‌ ఉంది. అలాగే, చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో కూడా మరో ప్రాజెక్ట్‌ను అనౌన్స్‌ చేశాడు. వీటితో పాటు బాలీవుడ్‌ సూపర్ హిట్‌ మూవీ ‘అంధాదున్’కు కూడా కొబ్బరి కాయ కొట్టాడు. మేర్లపాక గాంధీ దీనికి డైరెక్టర్. ఠాగూర్ మధు సమర్పణలో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, అక్క నిఖితా రెడ్డి నిర్మించనున్నారు. శ్రేష్ట మూవీస్‌ మూడున్నర కోట్లకు రీమేక్ రైట్స్‌ కొనుగోలు చేసింది.

    Also Read: హీరోలతో పడుకోలేదని..నన్ను వేధించారు: రవీనా టాండన్‌

    కథానుసారం ఇందులో నితిన్‌ అంధుడిగా నటిస్తాడు. మాతృకలో లేడీ విలన్‌ ఉంది. సినిమాకు మెయిన్‌ అసెట్‌ అదే. హిందీలో ఈ పాత్రను సీనియర్ యాక్ట్రెస్‌ టబు పోషించింది. అద్భుత నటనతో సినిమాను రక్తికట్టించింది. తెలుగు రీమేక్‌లో ఈ పాత్ర కు ఎవరిని తీసుకోవాలా అని చిత్ర బృందం చాన్నాళ్లుగా అన్వేషిస్తోంది. టబునే సంప్రదించగా.. మొదట సంసిద్ధత వ్యక్తం చేయలేదు. చిత్ర బృందం అదే పనిగా అడిగితే భారీ రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేసిందట. దాంతో, హాట్‌ యాంకర్ అనసూయ పేరు తెరపైకి వచ్చింది. గతంలో ‘క్షణం’లో విలన్‌గా మెప్పించిన అనసూయ కూడా నో చెప్పిందని సమాచారం.

    Also Read: పాపం రకుల్.. మొత్తం పోయేదాకా తెచ్చుకుంది !

    ఆ తర్వాత రమ్యకృష్ణ, అలనాటి అందాల నటి శిల్పా శెట్టి పేర్లు కూడా వినిపించాయి. శిల్ప అయితే ఒప్పుకున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. కానీ, అందులో నిజం లేదని తేలడంతో విలన్‌ అన్వేషణ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజా సమాచారం మేరకు లేడీ సూపర్ స్టార్ నయనతారను అప్రోచ్‌ అయిందట చిత్ర బృందం. అయితే, సౌత్‌లో స్టార్ హీరోలను తలదన్నే పాపులారిటీ సొంతం చేసుకున్న నయన్‌కు ఇప్పుడు ఫుల్‌ డిమాండ్‌ ఉంది.ఆడియో ఫంక్షన్స్‌, సినిమా ప్రమోషన్లకు కూడా డేట్స్‌ ఇచ్చే తీరిక లేకుండా బిజీగా ఉన్న నటి ఆమె. అలాంటి స్టార్ హీరోయిన్..‌ నితిన్‌ లాంటి యంగ్‌ హీరో సినిమాలో పైగా విలన్‌ పాత్రలో నటించేందుకు ఒప్పుకుంటుందా? అంటే సమాధానం చెప్పలేం. పైగా, ఈ మూవీలో హీరోయిన్‌గా నటించేందుకు పూజా హెగ్డే నో చెప్పిందట. మరి, నయన్‌ సంప్రదించే సాహనం చేసిన నితిన్‌ అండ్‌ కో ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూడాలి.