https://oktelugu.com/

10లక్షలు కట్టించుకున్న జబర్దస్త్.? నాగబాబు పంచ్..!

మెగా బ్రదర్ నాగబాబుకు మల్లెమాల.. జబర్దస్త్ షోతో మంచి అనుబంధం ఉంది. జబర్దస్ లో నాగబాబు, రోజా జడ్జిలు ఉండి షోను ముందుండి నడిపించారు. ఈ షోకే యాంకర్ అనసూయ.. రష్మిలతోపాటు నాగబాబు.. రోజా ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అయితే ఉన్నట్టుండి నాగబాబు జబర్దస్త్ షో నుంచి తప్పుకోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. Also Read:అక్కినేని షోనా.? బిగ్‌బాస్‌ షోపై నెటిజన్స్ ట్రోల్స్‌ ఆ తర్వాత కొన్నిరోజులకు నాగబాబు జబర్దస్ కు పోటీగా జీటీవీలో ‘అదిరింది’ షోను […]

Written By:
  • NARESH
  • , Updated On : October 27, 2020 / 02:44 PM IST
    Follow us on

    మెగా బ్రదర్ నాగబాబుకు మల్లెమాల.. జబర్దస్త్ షోతో మంచి అనుబంధం ఉంది. జబర్దస్ లో నాగబాబు, రోజా జడ్జిలు ఉండి షోను ముందుండి నడిపించారు. ఈ షోకే యాంకర్ అనసూయ.. రష్మిలతోపాటు నాగబాబు.. రోజా ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అయితే ఉన్నట్టుండి నాగబాబు జబర్దస్త్ షో నుంచి తప్పుకోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

    Also Read:అక్కినేని షోనా.? బిగ్‌బాస్‌ షోపై నెటిజన్స్ ట్రోల్స్‌

    ఆ తర్వాత కొన్నిరోజులకు నాగబాబు జబర్దస్ కు పోటీగా జీటీవీలో ‘అదిరింది’ షోను ప్లాన్ చేశారు. భారీ అంచనాల మధ్య ప్రారంభమైన ‘అదిరింది’ కామెడీ షో జబర్దస్త్ ను బీట్ చేయలేకపోయింది. అయితే ఈ షో ద్వారా కొంతమంది కామెడీయన్లు వెలుగులోకి వచ్చారు. ఈక్రమంలోనే ‘అదిరింది’ను ఇటీవల ‘బొమ్మ అదిరింది’గా నాగబాబు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

    ‘అదిరింది’ షో కంటే ‘బొమ్మ అదిరింది’ షో బాగా క్లిక్ అయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఓ పొట్టి వ్యక్తి చేసిన స్క్రిప్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. దీనిపై రాజకీయంగా దుమారం చెలరేగడంతో ఈ స్ర్కిప్ట్ చేసిన కామెడీయన్లు.. షో నిర్వాహాకులు జగన్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన సంగతి తెల్సిందే.

    ఆ తర్వాత కూడా ‘బొమ్మ అదిరింది’లో పలువురు సెలబ్రెటీలను కామెడీ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ‘బొమ్మ అదిరింది’లో చమ్మక్ చంద్ర ఓ కాంట్రాక్ట్ మీద చేసిన స్కిట్ చేశాడు. చంద్ర ఓ కాంట్రాక్ట్ మీద ఓ ఇంట్లో పని మనిషిగా చేరుతాడు. ఆ ఇంటి యజమాని ముందుగా రాయించుకున్న కాంట్రాక్ట్ ప్రకారం.. ఏడాదిలోపు పని మనిషి తనంతట తాను మానేస్తే రూ.10లక్షలు ఇవ్వాలని.. తాము గెంటేస్తే పని మనిషికి పది లక్షలు ఇవ్వాలని ఉంటుంది.

    Also Read: ‘ఆర్ఆర్ఆర్’ రచ్చ..రాజమౌళికి వార్నింగ్.. రంగంలోకి బీజేపీ ఎంపీ.!

    కాంట్రాక్టులోని లొసుగులను గుర్తించిన ఆ పని మనిషిగా ఉన్న చంద్ర యజమానులను ముప్పు తిప్పలు పెడతాడు. అయితే జబర్దస్త్ లోనూ ఇలాంటి కాంట్రాక్ట్ ఉందనే టాక్ విన్పిస్తోంది. దీంతోనే జబర్దస్త్ ను ఉద్దేశించి పరోక్షంగా చంద్ర ఈ సైటర్లు వేశారని సమాచారం. కొందరైతే వాళ్లు గెంటేసినా.. మనం మానేసినా మనచేతే రూ.10 లక్షలు కట్టించుకుంటారని మల్లెమాల ఉద్దేశించి అన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అవినాష్ బిగ్ బాస్ కు వెళ్లేందుకు రూ.10లక్షలు కట్టాడనే ప్రచారం అప్పట్లో జరిగింది. దీనినే ఉద్దేశించే నాగబాబు ‘జబర్దస్త్’పై పంచ్ వేయడం వైరల్ గా మారింది.