
తిరుమల తిరుపతి దేవస్థానంలో వచ్చే నెలలో జరిగే ప్రత్యేక ఉత్సవాలకు టికెట్లను టీటీడీ అందుబాటులో ఉంచింది. నవంబర్ 14న దీపావళి ఆస్థానం, 18న నాగుల చవితి, 20న పుష్పయాగానికి అంకురార్పణ, 21న పుష్పయాగ మహోత్సవం, 25న స్మార్త ఏకాదశి, 26న చాతుర్మాస వ్రత సమాప్తి, 27న కైశిక ద్వాదశి ఆస్థానం, 29న కార్తీక దీపం ఉంటాయని టీటీడీ తెలపిపింది. ఈ ఉత్సవాల్లో పాల్గొనే భక్తుల కోసం ఉదయం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు 19 స్లాట్లలో టికెట్లను కేటాయించనున్నారు. ఒక్కో స్టాట్‌లో వెయ్యి మందికి దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.