ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాపై జనవరి 26న స్పష్టమైన ప్రకటన వస్తుందని శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తెలిపారు. గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొత్తం 26 జిల్లాలో ఏర్పాటవుతాయని ఆయన తెలిపారు. వాన్‌పిక్ భూములను రైతులకు పరిహారం ఇచ్చారని, వాటిని సంస్థకు స్వాధీనం చేశారన్నారు. ఈ విషయంలో గందరగోళం సృష్టించవద్దన్నారు.