Naga Shaurya’s wife : నాగ శౌర్యకు కాబోయే భార్యకు ఎన్టీఆర్ తల్లికి ఉన్న సంబంధం ఏమిటో తెలుసా… ఇంట్రెస్టింగ్ డిటైల్స్!
Naga Shaurya’s wife : నాగ శౌర్య ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన పెళ్లికి సిద్ధమయ్యారు. నాగ శౌర్య వివాహం గురించి మీడియాలో ఎలాంటి సమాచారం లేదు. సోషల్ మీడియాలో ఆయన పెళ్లి పత్రిక చూసి అభిమానులు, చిత్ర ప్రముఖులు ఆశ్చర్యానికి గురయ్యారు. సడన్ గా పెళ్లి ఏంటి? అమ్మాయి ఎవరు? ప్రేమ పెళ్లా లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా? ఇలా పలు సందేహాలు మెదళ్ళు తొలిచేస్తున్నాయి.ఇక నాగ శౌర్య వివాహం చేసుకోబోయే అమ్మాయి పేరు […]
Naga Shaurya’s wife : నాగ శౌర్య ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన పెళ్లికి సిద్ధమయ్యారు. నాగ శౌర్య వివాహం గురించి మీడియాలో ఎలాంటి సమాచారం లేదు. సోషల్ మీడియాలో ఆయన పెళ్లి పత్రిక చూసి అభిమానులు, చిత్ర ప్రముఖులు ఆశ్చర్యానికి గురయ్యారు. సడన్ గా పెళ్లి ఏంటి? అమ్మాయి ఎవరు? ప్రేమ పెళ్లా లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా? ఇలా పలు సందేహాలు మెదళ్ళు తొలిచేస్తున్నాయి.ఇక నాగ శౌర్య వివాహం చేసుకోబోయే అమ్మాయి పేరు అనూష శెట్టి కాగా… ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. నేహా శెట్టి కర్ణాటకకు చెందిన ఇంటీరియర్ డిజైనర్, ఎంట్రప్రెన్యూర్. న్యూయార్క్ స్కూల్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్ ఇన్స్టిట్యూట్ నుండి సర్టీఫికేట్ పొందారు.
మార్కెటింగ్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అనూష శెట్టి బెంగుళూరు వేదికగా ఇంటీరియర్ డిజైన్ కంపెనీ నడుపుతున్నారు. అక్కడ ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ సంస్థగా అనూష శెట్టి కంపెనీకి పేరుంది. ఈ విభాగంలో ఆమె పలు ప్రతిష్టాత్మక అవార్డ్స్ అందుకున్నారు. చదువులో, తెలివితేటల్లో అనూష శెట్టి జెమ్ అని తెలుస్తుంది. మరి అనూష శెట్టితో నాగ శౌర్యకు సంబంధం ఎలా కుదిరింది. పెద్దలు కుదిర్చి పెళ్లి చేస్తున్నారా? లేక అనూష-నాగ శౌర్య రహస్యంగా ప్రేమించుకొని ఇప్పుడు పెళ్ళికి సిద్ధమయ్యారా? అనేది తెలియదు.
మరొక ఆసక్తికర విషయం ఏమిటంటే… ఎన్టీఆర్ తల్లిగారు షాలినితో అనూషకు చిన్న సంబంధం ఉంది. వీరిద్దరూ కర్ణాటకలో ఒకే గ్రామానికి చెందినవారు. ఉడిపి జిల్లా కుందపుర అనూష శెట్టి పుట్టిన ఊరు. ఎన్టీఆర్ తల్లిగారైన షాలినిది కూడా కుందపుర గ్రామమే. టీచర్ అయిన షాలినిని హరికృష్ణ రెండో వివాహం చేసుకున్నారు. వారి సంతానమే ఎన్టీఆర్. కాంతార మూవీ హీరో రిషబ్ శెట్టి కూడా కుందపుర గ్రామానికి చెందినవారు కావడం విశేషం.
బెంగుళూరులోనే వివాహ వేదిక ఏర్పాటు చేయడం విశేషం. జే డబ్ల్యూ మారియట్ వేదికగా నాగ శౌర్య-అనూష శెట్టి వివాహం రెండు రోజులు ఘనంగా జరగనుంది. నవంబర్ 19న మెహందీ వేడుక నిర్వహిస్తారు. నవంబర్ 20వ తేదీ ఉదయం 11:25 నిమిషాలకు పెళ్లి ముహూర్తం. పెళ్ళికి మరో పది రోజుల సమయం మాత్రమే ఉండగా… పనులు మొదలయ్యాయి. పెళ్లి బెంగుళూరులో నిర్వహిస్తుండగా చిత్ర ప్రముఖులకు ఆహ్వానం ఉంటుందో? లేక సన్నిహితుల సమక్షంలో ముగిస్తారో.? చూడాలి. నాగ శౌర్య వయసు 33 ఏళ్ళు కాగా గత రెండేళ్లుగా ఆయనకు పెళ్లి చేయాలని పేరెంట్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టకేలకు నాగ శౌర్య పెళ్ళికి బాజా మోగింది.