https://oktelugu.com/

కాంగ్రెస్.. బీజేపీలపై ఫైరవుతున్న కేటీఆర్.. ఎందుకు?

తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు హిటెక్కుతున్నాయి. అందరి కంటే ముందుగానే టీఆర్ఎస్ నగరంలో ప్రచారం మొదలుపెట్టింది. అయితే హైదరాబాద్లో కురిసిన అకాల వర్షాలతో నగరమంతా వరదల్లో కురుకుపోయింది. ప్రభుత్వం వైఫల్యం వల్లే హైదరాబాద్ వరదల్లో మునిగిందనే విమర్శలు వెల్లువెత్తాయి. మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్ వరద సాయం అందించేందుకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు చేపడుతోంది. అయితే వరద సాయంపై నగర వాసులు పెదవి విరుస్తుండటంతో బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై […]

Written By:
  • NARESH
  • , Updated On : November 8, 2020 6:31 pm
    Follow us on

    తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు హిటెక్కుతున్నాయి. అందరి కంటే ముందుగానే టీఆర్ఎస్ నగరంలో ప్రచారం మొదలుపెట్టింది. అయితే హైదరాబాద్లో కురిసిన అకాల వర్షాలతో నగరమంతా వరదల్లో కురుకుపోయింది. ప్రభుత్వం వైఫల్యం వల్లే హైదరాబాద్ వరదల్లో మునిగిందనే విమర్శలు వెల్లువెత్తాయి.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    వరద సాయం అందించేందుకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు చేపడుతోంది. అయితే వరద సాయంపై నగర వాసులు పెదవి విరుస్తుండటంతో బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై పెద్దఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. ఈనేపథ్యంలో మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి కాంగ్రెస్, బీజేపీ నేతలపై ఫైరయ్యారు.

    హైదరాబాద్లో టీఆర్ఎస్ నేతలంతా సాయమందించే పనిలో నిమగ్నమైతే బీజేపీ, కాంగ్రెస్ నేతలు మాత్రం దుబ్బాకలో ఓట్ల వేట ప్రారంభించారని విమర్శించారు. వరద సాయాన్ని పార్టీలకు అతీతంగా ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. అయితే సాయం పొందిన వారు సైతం కాంగ్రెస్, బీజేపీ నేతల మాయలోపడి ధర్నాలు చేస్తుండటం శోచనీయమన్నారు.

    Also Read: బీజేపీలోకి రాములమ్మ.. ముహుర్తం ఖరారైందా?

    ఇప్పటికే 4.30లక్షల కుటుంబాలకు వరద సాయం అందించినట్లు కేటీఆర్ తెలిపారు. ఎలాంటి బేషజాలకు పోకుండా సాయం చేసిన పార్టీగానీ.. ప్రభుత్వంగానీ ఎక్కడైనా ఉందా? అంటూ ప్రశ్నించారు. దుబ్బాక కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా దక్కదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ బురద రాజకీయాన్ని నగరవాసులు అర్థం చేసుకోవాలని కోరారు.