Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తన జీవిత ప్రయాణం లో నేర్చుకున్న పాఠాలు ఎలాంటివో తెలుసుకోవడానికి అభిమానుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, చిన్న చిన్న క్యారెక్టర్స్ తో కెరీర్ ని ప్రారంభించి, ఆ తర్వాత విలన్ గా పలు సినిమాల్లో నటించి, తద్వారా వచ్చిన ఫేమ్ తో హీరో గా మారి, ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు అందుకొని, లెక్కలేనన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిన మెగాస్టార్ సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని ప్రతీ ఒక్కరిలోనూ ఉంటుంది. 50 ఏళ్ళ వయస్సు దాటితే, బీపీ, షుగర్ అంటూ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ, మంచానికి పరిమితం అయ్యే మనుషులు ఉన్న ఈ రోజుల్లో, 70 ఏళ్ళ వయస్సులో కుర్ర హీరోలతో సమానమైన ఫైట్లు, డాన్స్ లు చేయడమే కాకుండా, బాక్స్ ఆఫీస్ వద్ద వాళ్ళతో సమానమైన రికార్డ్స్ ని నెలకొల్పడం మెగాస్టార్ కి ఎలా సాధ్యమైంది అనే సీక్రెట్ కూడా తెలుసుకోవాలని ప్రతీ ఒక్కరికి ఉంటుంది.
అదే విధంగా మన జీవితం లో ఫెయిల్యూర్ ఎదురైనప్పుడు చాలా కృంగిపోతూ ఉంటాము, కొంతమంది అయితే మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రతీ రోజు వార్తల్లో ఇలాంటివి చూస్తూనే ఉంటాం మనం. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో ఘోరమైన ఫ్లాపులు, డిజాస్టర్ ఫ్లాపులు ఉన్నాయి. అలాంటి ఫలితాలు దక్కినప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఆలోచన విధానం ఎలా ఉండేది?, కం బ్యాక్ ఇవ్వడానికి ఆయన పాటించిన సూత్రాలు ఏంటి?, ఇలాంటివి తెలుసుకోవాలనే కుతూహలం ప్రతీ ఒక్కరికి ఉంటుంది. అలాంటి కోరికలు ఉన్నవారికి గుడ్ న్యూస్. త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి తన జీవితంలోని అనుభవాలను పంచుకునేందుకు ‘పోడ్ క్యాస్ట్’ ని వేదిక గా చేసుకోనున్నాడు. ఈ ‘పోడ్ క్యాస్ట్’ ద్వారా ఆయన తన జీవితం లో ఎదురైనా అనుభవాలు, వాటి నుండి నేర్చుకున్న విషయాలను ప్రతీ రోజు మనతో పంచుకోనున్నాడు.
రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో సినీ పరిశ్రమకు చెందిన విలేఖరులు చిరంజీవి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా విలేఖరులతో కాసేపు ముచ్చట్లు చెప్పిన చిరంజీవి, త్వరలోనే తానూ ఒక ‘పోడ్ క్యాస్ట్’ ద్వారా మీ ముందుకు రాబోతున్నాను అనే విషయాన్నీ పంచుకున్నాడు. చిరంజీవి జీవితం లోని అనుభవాలు, అందులో నుండి ఆయన నేర్చుకున్న విధానాలు, నేటి తరం యువతకు ఎంతో ఉపయోగపడుతాయి. కాబట్టి ఈ పోడ్ క్యాస్ట్ కచ్చితంగా పెద్ద హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే ఈ పోడ్ క్యాస్ట్ కి సంబంధించిన వివరాలు అధికారికంగా బయటకు రానున్నాయి.