Rajinikanth And Kamal Haasan: తమిళ సినీ ఇండస్ట్రీ కి రెండు కళ్ళు లాంటి వాళ్ళు రజినీకాంత్(Superstar Rajinikanth), కమల్ హాసన్(Kamal Haasan). ఎన్నో దశాబ్దాల నుండి వీళ్లిద్దరు తమిళ సినిమా ఇండస్ట్రీ ని శాసిస్తున్నారు. మధ్యలో కమల్ హాసన్ ప్రయోగాలు అంటూ కొన్ని సినిమాలు చేసి ఫ్లాపులు అందుకొని రేస్ లో కాస్త వెనకబడ్డాడు, ఆ సమయం లో రజినీకాంత్ నెంబర్ 1 స్థానంలో కూర్చొని ఇండస్ట్రీ ని శాసించాడు. తమిళ ఇండస్ట్రీ ని కేవలం తమిళనాడు కి మాత్రమే పరిమితం చేయకుండా, ఇండియా వైడ్ గా వ్యాప్తి చేసి, ఓవర్సీస్ లో తిరుగులేని మార్కెట్ గా మార్చాడు రజినీకాంత్. అలా అని కమల్ హాసన్ తక్కువేం కాదు, వరుసగా ఫ్లాప్స్ వచ్చినప్పటికీ , ఒకే ఒక్క భారీ బ్లాక్ బస్టర్ తో రజినీకాంత్ కి సరిసమానమైన వసూళ్లను రాబట్టేవాడు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ ఇద్దరికీ సరసమైన పాపులారిటీ ఉంది.
ఇదంతా పక్కన పెడితే వీళ్లిద్దరు పెద్ద సూపర్ స్టార్స్ అయ్యాక వీళ్ళ కాంబినేషన్ లో ఒక్క మల్టీస్టార్రర్ చిత్రం వస్తే చూడాలని యావత్తు భారత దేశం లోని మూవీ లవర్స్ ఎంతగానో కోరుకున్నారు. కానీ స్టార్స్ అయ్యాక వీళ్ళ కాంబినేషన్ లో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రాలేదు. కానీ కెరీర్ ఆరంభం లో వీళ్లిద్దరు కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. కమల్ హాసన్ హీరో గా నటిస్తే, రజినీకాంత్ ఆ చిత్రం లో విలన్ గా నటించేవాడు. అలా ఆ కాంబినేషన్ కి ఆ రోజుల్లో మంచి క్రేజ్ ఉండేది. అయితే ఇన్నాళ్లకు ఈ ఇద్దరు హీరోలు కలిసి వెండితెర పై కనిపించడానికి సిద్ధమయ్యారు. వీళ్ళ కాంబినేషన్ లో ఒక మల్టీ స్టార్రర్ చిత్రం రాబోతుందని మన అందరికీ తెలిసిందే. ముందుగా ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తాడని అంతా అనుకున్నారు.
కానీ కుదర్లేదు, ఈ మధ్య గ్యాప్ లో రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ పై కమల్ హాసన్ నిర్మాతగా, రజినీకాంత్ ని హీరో గా పెట్టి ఒక సినిమా చెయ్యాలని అనుకున్నాడు. రీసెంట్ గానే ఆ ప్రాజెక్ట్ కి సంబందించిన అధికారిక ప్రకటన వచ్చింది. త్వరలోనే వీళ్ళ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మల్టీస్టార్రర్ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుంది. రజినీకాంత్ తో ప్రస్తుతం ‘జైలర్ 2’ చిత్రం చేస్తున్న నెల్సన్ దిలీప్ కుమార్ ఈ ప్రతిష్టాత్మక మల్టీస్టార్రర్ కి దర్శకత్వం వహించే బాధ్యతలు తీసుకున్నట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన శాంపిల్ టీజర్ ని కూడా ఈ వారం లోనే విడుదల చేయబోతున్నారట. ఈ క్రేజీ కాంబినేషన్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు త్వరలోనే రానున్నాయి.