Dhurandhar OTT: థియేటర్స్ లో గత రెండు నెలల నుండి నాన్ స్టాప్ గా రన్ అవుతున్న ‘ధురంధర్'(Dhurandhar Movie) చిత్రం కోసం ఓటీటీ ఆడియన్స్ చాలా రోజుల నుండి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్ ఈ చిత్రం ఓటీటీ విడుదల కోసం ఎదురు చూసినంత, ఈమధ్య కాలం లో తెలుగు సూపర్ హిట్ మూవీస్ కోసం కూడా ఎదురు చూడలేదు. ఎందుకంటే ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేటర్స్ లో విడుదల అవ్వలేదు. ప్రేక్షకులు తెలుగు వెర్షన్ ని విడుదల చెయ్యాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు కానీ, సమయం సరిపోకపోవడం తో అది కుదర్లేదు. కానీ ఓటీటీ వెర్షన్ లో మాత్రం తెలుగు లో కూడా విడుదల ఉంటుంది. తెలుగు, హిందీ తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ చిత్రం రేపు అనగా ఈరోజు అర్థ రాత్రి 12 గంటల నుండి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది.
ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ థియేటర్స్ లో విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత కొనుగోలు చేసింది. అన్ని భాషలకు కలిపి సుమారుగా 285 కోట్ల రూపాయలకు ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసిందట. ఇండియా లోనే ఇది ఆల్ టైం రికార్డు. మరి విడుదల తర్వాత థియేటర్స్ లో వచ్చిన రెస్పాన్స్ ని ఓటీటీ లో కూడా ఈ చిత్రం సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి. ఒకవేళ తెలుగు వెర్షన్ ని మన ఆడియన్స్ విపరీతంగా చూస్తే ‘ధురంధర్ 2’ కి తెలుగు రాష్ట్రాల్లో ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ రేంజ్ లో హైప్, క్రేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే కనుక జరిగితే ఈ చిత్రం ఇక్కడ కూడా వంద కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంటుంది.
‘ధురంధర్’ చిత్రానికి కేవలం హిందీ వెర్షన్ లోనే తెలుగు రాష్ట్రాల నుండి 70 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఇక తెలుగు వెర్షన్ ని ఓటీటీ లో చూసిన తర్వాత కచ్చితంగా ‘ధురంధర్ 2’ ని థియేటర్స్ లో చూడాలనే కోరిక ప్రతీ ఒక్కరిలోనూ కలుగుతుంది. అప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ నెలకొంటాయి. ఇకపోతే ఈ చిత్రం ఓవర్సీస్ లో 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టగా, ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 1070 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అంటే వరాల గా ఈ చిత్రానికి 1370 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓటీటీ లోకి వచ్చిన తర్వాత కూడా ఈ సినిమా థియేటర్స్ లో రన్ అవ్వనుంది.