https://oktelugu.com/

‘లవ్ స్టోరీ’ కథను రిజెక్ట్ చేసిన మెగా హీరో తెగ బాధపడుతున్నాడట..!

‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటారు’.. ఇప్పుడు టాలీవుడ్ లో కరోనా సెకండ్ వేవ్ తర్వాత భారీ హిట్ గా నిలిచిన నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ మూవీని చూసి ఆ మెగా హీరో తెగ బాధపడిపోతున్నాడట.. ఎందుకు ఈ సినిమా మిస్ చేసుకున్నానని మథన పడుతున్నాడట.. ఎందుకంటే శేఖర్ కమ్ముల మొదట ఈ సినిమాను ‘నాగచైతన్య’తో అనుకోలేదట.. మెగా హీరోను సంప్రదించాడట.. కానీ అతడు ఒప్పుకొని మరీ తప్పుకోవడంతో చైతన్య తలుపుతట్టడం.. అతడు ఒప్పేసుకోవడం.. సినిమా హిట్ కావడం […]

Written By:
  • NARESH
  • , Updated On : September 27, 2021 / 11:45 AM IST
    Follow us on

    ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటారు’.. ఇప్పుడు టాలీవుడ్ లో కరోనా సెకండ్ వేవ్ తర్వాత భారీ హిట్ గా నిలిచిన నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ మూవీని చూసి ఆ మెగా హీరో తెగ బాధపడిపోతున్నాడట.. ఎందుకు ఈ సినిమా మిస్ చేసుకున్నానని మథన పడుతున్నాడట.. ఎందుకంటే శేఖర్ కమ్ముల మొదట ఈ సినిమాను ‘నాగచైతన్య’తో అనుకోలేదట.. మెగా హీరోను సంప్రదించాడట.. కానీ అతడు ఒప్పుకొని మరీ తప్పుకోవడంతో చైతన్య తలుపుతట్టడం.. అతడు ఒప్పేసుకోవడం.. సినిమా హిట్ కావడం జరిగిపోయింది. అలా మెగా హీరోకు ఒక బంపర్ హిట్ మూవీ చేజారిపోయిందన్న టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది.

    కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ లో గ్రాండ్ హిట్అయిన మూవీ ‘లవ్ స్టోరీ’.ఇప్పుడు ఈ చిత్రం గురించే ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. నిజానికి శేఖర్ కమ్ముల ఈ కథలో ముందుగా ముక్కు మొహం తెలియని కొత్త వారితో సినిమాను దాదాపు 70శాతం పూర్తి చేశాడు. కానీ ఔట్ పుట్ చూసుకున్నాక ఎక్కడో తేడా కొట్టింది. సరిగ్గా రాలేదని తేలింది. అందుకే దాన్ని అంతా స్క్రాప్ చేసేసిన శేఖర్ కమ్ముల ఇదే కథను పట్టుకొని ముందుగా ‘ఉప్పెన’ మూవీతో ఊపేసిన వైష్ణవ్ తేజ్ వద్దకు వెళ్లాడట.. అతడు ఈ కథ విని బాగుందని హిట్ అవుతుందని అనుకున్నాడట..

    కానీ ఇప్పటికే ‘ఉప్పెన’తో కులాంతర ప్రేమను టచ్ చేసిన వైష్ణవ్ తేజ్ మళ్లీ అలాంటి కథే వస్తే ఇమేజ్ పడిపోతుందని వద్దని ‘క్రిష్’ దర్శకత్వంలో ‘కొండపొలం’కు ఓకే చెప్పాడు.

    ఇదే కథను నాగచైతన్య-నాగార్జునకు వినిపించగా.. బాగుండడంతో వెంటనే ఒప్పేసుకోవడం.. చేయడం జరిగిపోయింది. ఇమేజ్ చట్రంలో కథను వద్దన్న వైష్ణవ్ తేజ్ ఇప్పుడు ‘లవ్ స్టోరీ’ హిట్ తో తెగ బాధపడిపోతున్నాడట.. అనవసరంగా సినిమా వదులుకున్నానా? అని ఆవేదన చెందుతున్నట్టు టాలీవుడ్ టాక్.