Homeఎంటర్టైన్మెంట్Maremma Teaser Review: రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తున్న 'మారెమ్మ' టీజర్..రవితేజ మేనల్లుడు అదరగొట్టేసాడు!

Maremma Teaser Review: రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తున్న ‘మారెమ్మ’ టీజర్..రవితేజ మేనల్లుడు అదరగొట్టేసాడు!

Maremma Teaser Review: మాస్ మహారాజ రవితేజ(Mass Maharaja Raviteja) సోదరుడి తనయుడు మాధవ్ భూపతి రాజు(Madhav Bhupati Raju) హీరో గా పరిచయం అవుతూ తెరకెక్కిన చిత్రం ‘మారెమ్మ'(Maremma Teaser). మంచాల నాగరాజు దర్శకత్వం లో తెరకెక్కిన్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని మేకర్స్ నేడు విడుదల చేశారు. ఈ టీజర్ కి సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి అనూహ్య స్పందన లభించింది. గ్రామంలో విద్వంసాలు సృష్టిస్తున్న ఒక మహమ్మారి పని బట్టే క్యారక్టర్ లో ఇందులో మాధవ్ భూపతి రాజు కనిపించాడు. ఆ మహమ్మారి కారణంగా మనుషులే కాదు, మూగ జీవాలు కూడా చనిపోతూ ఉంటాయి. గ్రామస్తులు తమ గ్రామ దేవత మారెమ్మ తల్లిని ఎన్నో వందల సంవత్సరాల నుండి పూజిస్తూ వస్తుంటారు. ఆ దేవతకు సంబంధించిన ఎద్దుని కాపాడే బాధ్యత హీరో పై ఉంటుంది. అయితే ఒక రోజు ఆ ఎద్దు అదృశ్యం అవుతుంది.ఇక్కడి నుండి కథ ఎలా మలుపు తిరిగింది అనేది వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

మాధవ్ కి ఇది మొదటి చిత్రం అయినప్పటికీ చాలా పరిణీతి చెందిన నటుడిలాగా అనిపించాడు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ కూడా చాలా చక్కగా అనిపించింది. సాధారణంగా ఒక పెద్ద కుటుంబానికి సంబంధించిన వారసులు ఇండస్ట్రీ లోకి రావాలని అనుకున్నప్పుడు చాలా సేఫ్ గా ఒక కమర్షియల్ సినిమాని కానీ, లేదంటే ఒక ప్రేమ కథ ని కానీ ఎంచుకుంటారు, లేదంటే పెద్ద స్టార్ డైరెక్టర్ తో చాలా సేఫ్ గా ఎంట్రీ ఇస్తారు. కానీ మాధవ్ మాత్రం తొలిసినిమా నుండే విభిన్నమైన కథతో రావాలని అనుకున్నాడు. ఈ తరం ప్రేక్షకులు కూడా ఇలాంటి సినిమాలనే చూస్తున్నారు. టీజర్ కూడా చాలా కొత్తగా, కచ్చితంగా క్లిక్ అయ్యేలాగా అనిపించింది. ఇక ఈ చిత్రం లో సీనియర్ హీరో వినోద్ కుమార్ కీలక పాత్ర పోషించాడు. చాలా కాలం తర్వాత ఆయనకు కూడా మంచి పాత్ర దక్కినట్టుగా అనిపించింది.

ఈమధ్య కాలం లో తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమాలు చాలా బాగుంటున్నాయి, ఆడియన్స్ ఆ చిత్రాలకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా కూడా తెలంగాణ ప్రాంతం లో జరిగిన కొన్ని యదార్ధ సంఘటనలను ఆధారంగా తీసుకొనే చిత్రీకరించారు. సినిమాటోగ్రఫీ, నేపధ్య సంగీతం కూడా చాలా చక్కగా , నేచురల్ గా అనిపించింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలాగా అనిపిస్తుంది కాబట్టి, బలగం లాగా ఈ సినిమా కూడా కమర్షియల్ గా పెద్ద రేంజ్ కి వెళ్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకున్న ఈ సినిమా టీజర్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

 

Maremma Official Teaser | Maadhav Bhupathiraju | Deepa Balu | Manchala Nagaraj | Moksha Arts

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version