సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి హిట్ లో ఉన్నాడు. మహేష్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టనున్నాడట, దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే భారీ పాన్ ఇండియా మల్టీ స్టారర్ మూవీ లో మహేష్ నటిస్తున్నడనే వార్త టాలీవుడ్ ఇండస్ట్రీ లో హల్చల్ చేస్తుంది.
బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియావాలా నుంచి మహేష్ కు భారీ ఆఫర్ వచ్చినట్టుగా టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ఇటీవల ఓ కంపెనీ యాడ్ కోసం బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తో కలిసి మహేశ్ నటించారు. ఈ యాడ్ షూటింగ్ ముంబైలో జరుగుతుండగా, అక్కడికి వచ్చిన సాజిద్, ఇరువురు కధానాయకులతో సంప్రదింపులు జరిపారట. మహేష్ బాబు, రణవీర్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఒకవేళ ఈ క్రేజీ కాంబినేషన్ నిజమైతే గనుక అభిమానులకు పండుగే అనడంలో ఎలాంటి సందేహం లేదు.
గతంలో మహేష్ బాబు పలుమార్లు బాలీవుడ్ ఎంట్రీ పై స్పష్టత ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ వార్త పై మహేష్ నుంచి క్లారిటీ రావల్సివుంది.