https://oktelugu.com/

కేజీఎఫ్2 నైజాం హక్కులకు అంత డిమాండా?

2018 సంవత్సరం డిసెంబర్ నెల 21వ తేదీన క్రిస్ మస్ పండుగ సందర్భంగా విడుదలై కన్నడ, తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది కేజీఎఫ్ ఛాప్టర్ 1. వారాహి చలన చిత్రం బ్యానర్ అధినేత సాయి కొర్రపాటి కేజీఎఫ్ మూవీ హక్కులను కొనుగోలు చేయగా పెట్టుబడికి రెట్టింపు లాభాలు వచ్చాయి. తెలుగులో బాహుబలి సిరీస్ ద్వారా ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ గా ఏ విధంగా గుర్తింపు వచ్చిందో […]

Written By:
  • NARESH
  • , Updated On : January 27, 2021 / 09:22 PM IST
    Follow us on

    2018 సంవత్సరం డిసెంబర్ నెల 21వ తేదీన క్రిస్ మస్ పండుగ సందర్భంగా విడుదలై కన్నడ, తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది కేజీఎఫ్ ఛాప్టర్ 1. వారాహి చలన చిత్రం బ్యానర్ అధినేత సాయి కొర్రపాటి కేజీఎఫ్ మూవీ హక్కులను కొనుగోలు చేయగా పెట్టుబడికి రెట్టింపు లాభాలు వచ్చాయి. తెలుగులో బాహుబలి సిరీస్ ద్వారా ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ గా ఏ విధంగా గుర్తింపు వచ్చిందో యశ్ కు కూడా కేజీఎఫ్ సినిమా ద్వారా అదే తరహా గుర్తింపు వచ్చింది.

    ఈ సినిమా ద్వారా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు తెలుగులో స్టార్ హీరోలు ఆఫర్లు ఇస్తున్నారు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సలార్ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా ఈ ఏడాది సెకండాఫ్ లో విడుదల కానుందని తెలుస్తోంది.

    ఇకపోతే కేజీఎఫ్ ఛాప్టర్ 2 మూవీ తెలుగు హక్కులు కళ్లు చెదిరే రేటుకు అమ్ముడయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కేజీఎఫ్ ఛాప్టర్ 2 మూవీపై మొదటి నుంచి భారీగా అంచనాలు ఉండగా టీజర్ విడుదలైన తరువాత ఆ అంచనాలు భారీగా పెరిగాయి.

    కేజీఎఫ్ ఛాప్టర్ 1తో పోల్చి చూస్తే ఆరేడు రెట్లు ఎక్కువగా కేజీఎఫ్ ఛాప్టర్ 2 వసూలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే పలు ఏరియాలకు సంబంధించి రికార్డు స్థాయి బిజినెస్ జరుగుతోందని టాక్.ఇక తెలంగాణ నైజాంకు సంబంధించి తాజాగా హక్కుల కోసం ఏకంగా 75 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారట.. అంత వసూలు చేస్తుందా? లేదా అన్నది ఆలోచించకుండా టాలీవుడ్ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా నైజాం రైట్స్ కోసం పోటీపడుతున్నారట..