దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గినా కొత్తరకం కరోనా స్ట్రెయిన్ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనాతో పోలిస్తే బ్రిటన్ లో వెలుగులోకి వచ్చిన స్ట్రెయిన్ మరింత ప్రమాదకరమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. అయితే భారత్ బయోటెక్ కోవాగ్జిన్ వ్యాక్సిన్ కొత్తరకం కరోనా వైరస్ కు చెక్ పెడుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. భారత్ బయోటెక్ భారత వైద్య పరిశోధన మండలి నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయాలను వెల్లడించింది.
Also Read: కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే ఉద్యోగం పోయింది.. ఏం జరిగిందంటే..?
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సైంటిస్ట్ నిర్వహించిన ప్లేక్ రిడక్షన్ న్యూట్రలైజేషన్ టెస్ట్ ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఐసీఎంఆర్‌కు చెందిన ఈ సంస్థ కోవాగ్జిన్ ను తీసుకున్న వారి సెరాని ఈ పరీక్షలో వినియోగించి ఈ విషయాలను వెల్లడించింది. భారత్ లో కొత్తరకం కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో భారత్ బయోటెక్ చేసిన ఈ ప్రకటన ప్రజలకు శుభవార్తే అని చెప్పవచ్చు.
Also Read: కరోనా సోకిన వారికి మరో షాక్.. ఆ సమస్యలు వచ్చే ఛాన్స్..?
వూహాన్ లో పుట్టిన కరోనాతో పోలిస్తే ఈ వ్యాక్సిన్ 70 శాతం వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కొత్తరకం స్ట్రెయిన్ వల్ల పలు దేశాలు విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. విమానాల ద్వారా బ్రిటన్ నుంచి ఇండియాకు వచ్చిన 150 మందికి కొత్తరకం కరోనా స్ట్రెయిన్ నిర్ధారణ కావడం గమనార్హం. కోవాగ్జిన్ విజయవంతంగా కొత్తరకం కరోనా స్ట్రెయిన్ పై పని చేయడం ప్రజలకు శుభవార్తే అని చెప్పాలి.
మరిన్ని వార్తలు కోసం: కరోనా వైరస్
ఎమర్జెన్సీ వినియోగం కోసం కోవాగ్జిన్ కు అనుమతులు ఇచ్చినా ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం క్లినికల ట్రయల్ దశలో ఉందని తెలుస్తోంది. గతేడాది కరోనా మహమ్మారి విజృంభణ వల్ల భయాందోళనకు గురైన ప్రజలకు వ్యాక్సిన్ల గురించి వెలువడుతున్న శుభవార్తలు ఆందోళనను తగ్గిస్తున్నాయనే చెప్పాలి.