Junior NTR – Ram Charan : రామ్ చరణ్ కోసం ఎవ్వరు చెయ్యలేని త్యాగం చేసిన జూనియర్ ఎన్టీఆర్

Junior NTR Ram Charan : ఈ ఏడాది విడుదలైన #RRR సినిమా లో రామరాజు మరియు భీం మధ్య ఉన్న స్నేహబంధాన్ని ప్రపంచం మొత్తం చూసింది..కానీ సినిమాలో రాజమౌళి చూపించింది కేవలం పది శాతం మాత్రమే..నిజజీవితం లో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ మధ్య అంతకంటే గొప్ప స్నేహ సంభందం ఉంది..అందుకు ఉదాహరణగా నిలిచింది లేటెస్ట్ గా జరిగిన ఒక సంఘటన..అసలు విషయానికి వస్తే ఎన్టీఆర్ మరియు బుచ్చి బాబు కాంబినేషన్ లో ఒక సినిమా ఖరారైందని […]

Written By: NARESH, Updated On : November 22, 2022 8:36 pm
Follow us on

Junior NTR Ram Charan : ఈ ఏడాది విడుదలైన #RRR సినిమా లో రామరాజు మరియు భీం మధ్య ఉన్న స్నేహబంధాన్ని ప్రపంచం మొత్తం చూసింది..కానీ సినిమాలో రాజమౌళి చూపించింది కేవలం పది శాతం మాత్రమే..నిజజీవితం లో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ మధ్య అంతకంటే గొప్ప స్నేహ సంభందం ఉంది..అందుకు ఉదాహరణగా నిలిచింది లేటెస్ట్ గా జరిగిన ఒక సంఘటన..అసలు విషయానికి వస్తే ఎన్టీఆర్ మరియు బుచ్చి బాబు కాంబినేషన్ లో ఒక సినిమా ఖరారైందని ప్రతి ఒక్కరికి తెలుసు.

 

అయితే జూనియర్ ఎన్టీఆర్ ముందుగా కొరటాల శివ తో కమిటైన సినిమాని చేసిన తర్వాతే నీకు డేట్స్ ఇస్తానని బుచ్చి బాబుకి చెప్పాడట..దీనితో బుచ్చి బాబు పుష్ప పార్ట్ 2 స్క్రిప్ట్ వర్క్ లో తన గురువు సుకుమార్ కి సహాయం చెయ్యడానికి తన సమయాన్ని కేటాయించాడు..ఇది ఇలా ఉండగా రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే..ఈ సినిమా తర్వాత ఆయన జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తో ఒక సినిమా చెయ్యాల్సి ఉంది.

అయితే రామ్ చరణ్ మరియు గౌతమ్ కి మధ్య ఏర్పడిన కొన్ని క్రియేటివ్ డిఫరెన్స్ కారణం గా ఈ చిత్రాన్ని కథా చర్చల దశలోనే ఆపేయాల్సి వచ్చింది..అందువల్ల రామ్ చరణ్ 16 వ సినిమా స్లాట్ ఖాళీ అయ్యింది..దీనితో గౌతమ్ ప్రాజెక్ట్ బదులు వేరే ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించేందుకు రామ్ చరణ్ కొన్ని స్టోరీలు విన్నాడు కానీ ఒక్క స్టోరీ కూడా నచ్చలేదట..ప్రస్తుతం ఆయన శంకర్ మూవీ లోని సాంగ్ షూట్ కోసం న్యూజిలాండ్ టూర్ కి వెళ్ళాడు..న్యూజిలాండ్ కి వెళ్లే ముందు ఎన్టీఆర్ ని మాములుగా ఒకసారి కలిశాడట రామ్ చరణ్.

ఇలా తన 16 వ సినిమా గురించి చర్చ కి వచ్చినప్పుడు..’బుచ్చి బాబు నాకు ఒక స్టోరీ చెప్పాడు..ఆ స్టోరీ నాకంటే కూడా నీకే బాగుంటుంది అని నాకు అనిపించింది..ఒకసారి బుచ్చి బాబుని పిలిపించుకొని ఆ కథని విను..నచ్చితే నువ్వు చేసేయి’ అని ఎన్టీఆర్ అన్నాడట..ఎన్టీఆర్ చెప్పాడు కాబట్టి రామ్ చరణ్ బుచ్చి బాబు ని స్వయంగా పిలిపించుకొని కథని విన్నాడట..విన్న వెంటనే రామ్ చరణ్ కి కథ అద్భుతంగా నచ్చడంతో వెంటనే ఈ చిత్రాన్ని చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం..అలా ఎన్టీఆర్ తానూ చెయ్యాల్సిన స్టోరీ ని రామ్ చరణ్ కోసం వదిలేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న మాట.