War2 Jr NTR Hrithik Roshan: ఎన్టీఆర్(junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వార్ 2′(War 2 Movie) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పెరేడ్ గ్రౌండ్స్ లో ఎంతో అట్టహాసంగా జరిగింది. హీరోలిద్దరూ ఎంతో అద్భుతంగా ప్రసంగించారు. అభిమానుల కోలాహలం, సందడి మధ్య ఈ ఈవెంట్ ఎంతో ఆహ్లాదకరంగా జరిగింది. అసలు ఈ సినిమా గురించి ఎవ్వరూ మాట్లాడుకోవడం లేదు అని అనుకునే స్థాయి నుండి, ఈ సినిమా టాపిక్ తప్ప మరో సినిమా గురించి మాట్లాడుకోవడం లేదు అనే స్థాయి వరకు జూనియర్ ఎన్టీఆర్ ఒకే ఒక్క ప్రసంగం తో తీసుకొచ్చాడు. అంతా బాగానే ఉంది, కానీ హృతిక్ రోషన్ గురించి జూనియర్ ఎన్టీఆర్, నిర్మాత నాగవంశీ తెలియకుండా కొన్ని మాటలు మాట్లాడారని, ఇది చాలా తప్పు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: ‘మాస్ జాతర’ మూవీ టీజర్ చూస్తే ఆ సినిమానే గుర్తుకు వస్తోందిగా..?
ముందుగా నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ‘ఎన్టీఆర్ అన్నని బాలీవుడ్ కి తీసుకెళ్లడం కాదు, హృతిక్ రోషన్ గారినే మన టాలీవుడ్ కి తీసుకొస్తున్నాం’ అని అన్నాడు. అనంతరం ఎన్టీఆర్ కూడా తన ప్రసంగం లో నేను ఎలా అయితే బాలీవుడ్ కి ఈ చిత్రం ద్వారా పరిచయం కాబోతున్నానో, హృతిక్ రోషన్ గారు కూడా మన టాలీవుడ్ కి అలా పరిచయం కాబోతున్నాడు. ఆయన్ని నా అభిమానులు ఇక నుండి గుండెల్లో పెట్టుకొని మరీ అభిమానిస్తారు అంటూ చెప్పుకొచ్చాడు. కానీ అసలు విషయం ఏమిటంటే హృతిక్ రోషన్ హిందీ సినిమాలు తెలుగు లో దబ్ అయ్యి ఇంతకు ముందే భారీ కమర్షియల్ సక్సెస్ లు సాధించాయి. క్రిష్, క్రిష్ 3 , ధూమ్ 2 వంటి చిత్రాలు మన తెలుగు భాషలో సంచలన విజయాలు సాధించాయి. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ లో హృతిక్ రోషన్ ఒకప్పుడు ఎన్టీఆర్ కంటే చాలా పెద్ద హీరో.
Also Read: ‘పరదా’ మూవీ ట్రైలర్ లో ఆ ఒక్కటి తగ్గిందా..?
ఒకప్పుడు మాత్రమే కాదు, ఇప్పుడు కూడా అదే రేంజ్ డామినేషన్ ఉంటుంది. ఆయన ఒక యాక్షన్ సినిమా చేసి, దానికి సూపర్ హిట్ టాక్ వస్తే ఇండియా లో ఏ హీరో కూడా అతని ముందు సరిపోడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మన తెలుగు ఆడియన్స్ అత్యధికంగా ఇష్టపడే ఏకైక హిందీ హీరో ఆయన. సరిగ్గా శ్రద్ద చూపించలేదు కానీ, తెలుగు మరియు ఇతర సౌత్ మార్కెట్స్ పై హృతిక్ రోషన్ మొదటి నుండి శ్రద్ద చూపించి ఉండుంటే నేడు సౌత్ లో ఆయన రేంజ్ ఎవ్వరియుయూ ఊహించని రేంజ్ లో ఉండేది. 2014 వ సంవత్సరం వరకు హృతిక్ రోషన్ ప్రతీ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో బంపర్ ఓపెనింగ్స్ వచ్చేవి. ఆ తర్వాత వరుసగా ఆఫ్ బీట్ సినిమాలు చేయడం తో మార్కెట్ కాస్త దెబ్బతినింది. హృతిక్ రోషన్ హిస్టరీ గురించి ఎన్టీఆర్, నాగవంశీ కి పెద్దగా అవగాహనా లేదని, అందుకే అలా మాట్లాడారని అంటున్నారు నెటిజెన్స్.