Lakshmi Pranathi Emotional: డైరెక్టర్ విజన్ కి తగ్గట్టు తమని తాము మార్చుకొని పని చేసే హీరోలు మన ఇండియా లో చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు , ఆ తక్కువ మందిలో ఒకరు జూనియర్ ఎన్టీఆర్. డైరెక్టర్ విజన్ కి తగ్గట్టు తన శరీర ఆకృతి ని మార్చుకోవడం లో ఎన్టీఆర్ ని మించిన హీరో ఇండస్ట్రీ లో మరొకరు ఉండరు అనడంలో ఎలాంటి సందేహం లేదు . ఒకప్పుడు ఎన్టీఆర్ ఎంత లావుగా ఉండేవాడో అందరికీ తెలిసిందే , అప్పటి ఎన్టీఆర్ కి , ఇప్పటి ఎన్టీఆర్ కి తేడా చూస్తే ఆయన ఎంత కష్టపడుతున్నాడో అర్థం అవుతుంది. ఇకపోతే నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా , మేకర్స్ నిన్న ‘డ్రాగన్’ మూవీ గ్లింప్స్ వీడియో ని విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ గ్లింప్స్ వీడియో కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది కానీ , ఎన్టీఆర్ లుక్స్ పై ట్రోల్స్ చాలా గట్టిగ వచ్చాయి.
అయితే ఈ లుక్స్ కోసం ఎన్టీఆర్ ఏ రేంజ్ లో కష్టపడ్డాడో , ప్రశాంత్ నీల్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘ఎన్టీఆర్ ని ఈ సినిమా కోసం కాస్త మేకోవర్ అవ్వాలని చెప్పాను , కానీ అతని తగ్గినా బరువు ని చూసి షాక్ కి గురయ్యాను. బాగా నీరసించిపోయారు, పేలవంగా మారడమే కాకుండా , అనారోగ్యానికి గురైన వాడిలాగా కనిపించాడు. కేవలం డ్రాగన్ చిత్రం కోసం ఎన్టీఆర్ నాలుగు నెలల్లో 15 కిలోల బరువు తగ్గాడు. ఇక చాలు బరువు తగ్గడం ఆపేయ్ అని ఎన్టీఆర్ కి చాలా గట్టిగా చెప్పాను , అయినప్పటికీ ఆయన వెనకడుగు వెయ్యలేదు. ఎన్టీఆర్ పడుతున్న కష్టాన్ని చూసి ఆయన సతీమణి లక్ష్మి ప్రణతి కంటతడి పెట్టుకుంది. ఏ భార్య కి అయినా తమ భర్త అలా కష్టపడుతూ పని చేయడం చూస్తే చాలా బాధ కలుగుతుంది కదా, ప్రణతి కి కూడా అంతే’.
‘నా టీం కూడా ఎన్టీఆర్ పడే కష్టాన్ని చూసి బాగా బాధపడ్డారు. మీ విజన్ కి తగ్గ ఔట్పుట్ వచ్చేంత వరకు నేను దేనికైనా సిద్ధమని చెప్పి, ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టి పనిచేశాడు. సినిమా పట్ల ఎన్టీఆర్ చూపించే డెడికేషన్ కి సెల్యూట్ చేయొచ్చు’ అంటూ ప్రశాంత్ నీల్ ఈ సందర్భంగా చెప్పుకోచ్చాడు. ఇకపోతే డ్రాగన్ చిత్రం దేశభక్తి కి సంబంధించిన సినిమా అని , ఎవ్వరూ ఊహించని ట్విస్టులు ఈ చిత్రం లో ఉంటాయని ప్రశాంత్ నీల్ రీసెంట్ గా జరిగిన ఈ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.
