News Channel: సపాటు ఎటూ లేదు పాట అయినా పాడు బ్రదర్ అని ఆకలిరాజ్యంలో నిరుద్యోగులు పాడుతున్నారు.ఇప్పుడు జీతాలు ఎలాగూలేవు.. ఆఫీసులోని ఉన్న ఎలక్ట్రానిక్, ఇతర సామాను అయినా ఉపయోగపడుతుందని ఉద్యోగులు తమతోపాటు తీసుకెళుతున్నారట.. జీతాలు ఇవ్వకపోవడంతో ఉద్యోగులు చేతికొచ్చిన ఫర్నీచర్, కంప్యూటర్లు తీసుకెళుతున్నారట..
ఇక మరింత ఘోరం ఏంటంటే.. జిల్లాల రిపోర్టర్లు, స్టాఫ్ రిపోర్టర్లు తమకు ఇచ్చిన కెమెరాలు, ఎక్విప్ మెంట్ ను అంతా తమ దగ్గరే ఉంచుకున్నారట.. ఇక యాజమాన్యం పేరు చెప్పుకొని వసూళ్లు, యాడ్స్, కమీషన్లు దండుకుంటున్నారు.
ఈ క్రమంలోనే తమ సంస్థ పేరుతో వసూళ్లు చేసి కట్టని రిపోర్టర్లపై హైదరాబాద్ లో పోలీసులకు ఫిర్యాదు చేసింది సదురు యాజమాన్యం. ఇక జర్నలిస్టులు ఊరుకుంటారా? తమకూ జీతాలు ఇవ్వడం లేదంటూ సంస్థపై పోలీస్ మెట్లు ఎక్కారు.
Also Read: బీసీపీఎల్‌లో 36 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?
ఇలా జర్నలిస్టులు, కుదేలైన న్యూస్ చానెల్ మధ్య యమ రంజుగా ఫైట్ నడుస్తోందని మీడియా వర్గాల్లో హాట్ హాట్ చర్చ సాగుతోంది. ఇప్పటికే సంస్థను నడిపేందుకు అప్పులు తీసుకొచ్చి పెట్టిన చానెల్ యాజమాన్యం ఇప్పుడు ఆ అప్పులు తెచ్చి పెట్టే పరిస్థితి లేదని.. ఇక ఎత్తేయడం మిగిలిందంటున్నారు.
ప్రస్తుతానికి సదురు న్యూస్ చానెల్ జనసేనకు సపోర్టుగా ఉంది. కానీ పవన్ కానీ.. జనసేన నేతలు కానీ తమను ఆదుకోవాలని జర్నలిస్టులు కోరుతున్నారట.. మరి ఈ న్యూస్ చానెల్ ను ఎత్తేస్తారా? లేక అలానే వదిలేస్తారా? అన్నది వేచిచూడాలి.
Also Read: ఆధార్ కార్డుపై ఫోటో నచ్చలేదా.. ఏ విధంగా మార్చుకోవాలంటే?