Virat Kohli: బీసీసీఐ వన్డే జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మను నియమించారు. దీంతో కోహ్లి ని బాధ్యతల నుంచి తప్పించారు. క్రికెట్ బోర్డు సూచనల మేరకు కెప్టెన్ మార్పు అనివార్యమైనట్లు తెలుస్తోంది. దీంతోనే విరాట్ కోహ్లిని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించినట్లు సమాచారం. క్రికెట్ బోర్డే స్వయంగా ఆయనను తప్పించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మను కెప్టెన్ గా నియమించి బీసీసీఐ ప్రయోగాలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఇప్పటికే టీ 20 కెప్టెన్సీని వదులుకున్న విరాట్ కోహ్లి తాజాగా వన్డే జట్టుకు కూడా గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. విరాట్ కోహ్లి వన్డే జట్టుకు ఇష్టం లేకపోయినా బాధ్యతల నుంచి వైదొలగేలా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వేరు వేరు జట్టకు ఇద్దరు కెప్టెన్లు ఉండకూడదనే ఉద్దేశంతో కోహ్లిని తప్పించినట్లు సమాచారం. ప్రస్తుతం విరాట్ కోహ్లి టెస్ట్ మ్యాచ్ లకే పరిమితమైనట్లు చెబుతున్నారు. మంచి కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న కోహ్లిని బాధ్యతల నుంచి తప్పించడంతో అందరిలో ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు తొలగించకున్నా ఇంగ్లండ్ పర్యటన తరువాత బాధ్యతల నుంచి తప్పుకునే వారని తెలుస్తోంది. బీసీసీఐ నుంచి ఎలాంటి ఒత్తిడి లేకున్నా కోహ్లినే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు సమాచారం. దీంతో కోహ్లి కెప్టెన్ గా దూరం కావడం బాధాకరమే. కానీ ఎప్పుడో ఒకప్పుడు తప్పుకోవడం సహజమే కదా అనే విషయం తెలిసిందే. అయితే కోహ్లిని తొలగించడంపై సామాజిక మాధ్యమాల్లో అభిమానుల నుంచి ఆందోళన పెరుగుతోంది.
Also Read: Kohli : కోహ్లీ.. మరో ధోనీ అవుతాడా? లేదంటే జరిగేది అదే..
విరాట్ కోహ్లి ని బాధ్యతల నుంచి తప్పించడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. జట్టును సరైన దారిలో నడిపించిన కెప్టెన్ గా కోహ్లికి మంచి పేరు ఉన్నది. కానీ విజయాలు మాత్రం అందకుండా పోయాయి. దీంతో అప్రదిష్ట మూటగట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లిని కెప్టెన్ గా దూరం చేయడానికి బీసీసీఐ సంకల్పించడంలో ఏ మాత్రం ఆక్షేపణలు లేవని చెబుుతున్నారు.
Also Read: Team India Announced: విరాట్ కోహ్లీ శకం ముగిసినట్టే.. రోహిత్ కు ప్రమోషన్.. షాకిచ్చిన బీసీసీఐ