Varun Sandesh: ఇందువదనతో జనవరి1న ప్రేక్షకుల ముందుకు వరుణ్ సందేశ్​

Varun Sandesh: హ్యాపీడేస్ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరై.. కుర్రాళ్లు చిత్రంతో తనకంటూ ప్రత్యేక అభిమానాన్ని సొంతం చేసుకున్న హీరో వరుణ్ సందేశ్​. తాజాగా ఈ కుర్ర హీరో నటించిన ఇందువదన. ఇప్పటి వరకు తన కెరీర్​లో ఎప్పుడూ నటించని డిఫరెంట్ క్యారెక్టర్​లో ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమాతోనే చాలా గ్యాప్​ తర్వాత ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు వరుణ్​. మధ్యలో భార్యతో కలిసి బిగ్​బాస్​ సీజన్​3లో సందడి చేసిన వరుణ్​.. ఆ తర్వాత నుంచి కథలను ఎంచుకోవడంలో […]

Written By: Raghava Rao Gara, Updated On : December 10, 2021 5:47 pm
Follow us on

Varun Sandesh: హ్యాపీడేస్ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరై.. కుర్రాళ్లు చిత్రంతో తనకంటూ ప్రత్యేక అభిమానాన్ని సొంతం చేసుకున్న హీరో వరుణ్ సందేశ్​. తాజాగా ఈ కుర్ర హీరో నటించిన ఇందువదన. ఇప్పటి వరకు తన కెరీర్​లో ఎప్పుడూ నటించని డిఫరెంట్ క్యారెక్టర్​లో ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమాతోనే చాలా గ్యాప్​ తర్వాత ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు వరుణ్​. మధ్యలో భార్యతో కలిసి బిగ్​బాస్​ సీజన్​3లో సందడి చేసిన వరుణ్​.. ఆ తర్వాత నుంచి కథలను ఎంచుకోవడంలో ఆచితూచి అడుగులేస్తున్నారు.

Varun Sandesh

కొన్ని సినిమాల్లో గెస్ట్ అప్పియరెన్స్​ ఇవ్వడానికి కూడా వెనకాడని ఈ హీరో.. ఇందువదన సినిమాలో హీరోగా దర్శనమివ్వనున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన టీజర్​, సాంగ్స్​ మూవీపై ఆసక్తిని పెంచాయి. ఈ సస్పెన్స్​ రొమాంటిక్​ థ్రిల్లర్​ మూవీలో వరుణ్ సరసన ఫర్నాజ్ శెట్టి నటిస్తోంది.

Also Read: నయీం డైరీ సినిమాకు షాక్​.. స్టే విధించిన తెలంగాణ హైకోర్టు
ఎమ్మెస్సార్ దర్శకత్వంలో మాధవి ఆదుర్తి నిర్మించిన ఈ సినిమాకు శివ కాకాని సంగీతం అందించారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు మేకర్స్. ఫీల్​గుడ్​ లవ్​ స్టోరీతో వరుణ్ సందేశ్​ తిరిగి రీ ఎంట్రీ ఇస్తున్నారని.. ఈ చిత్రంలో ఆయన పాత్ర కొత్త పంథాలో ఉంటుందని దర్శకుడు ఎమ్మెస్సార్ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఇప్పటికే సెన్సార్​ను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా.. యు/ఎ సర్టిఫికెట్ లభించింది.

ఈ క్రమంలోనే చాలా గ్యాప్​ తర్వాత తిరిగి ప్రేక్షకులను పలకరించనున్న వరుణ్ ఏ రేంజ్​లో హిట్​ కొడతాడో తెలియాలంటే.. జనవరి 1వరకు వేచి చూడాల్సిందే.

Also Read: ఆటోలో గమనం సినిమా చూసేందుకు థియేటర్​కు వచ్చిన శ్రియ