https://oktelugu.com/

టీడీపీకి గడ్డుకాలం లోకేశ్‌తోనేనా..?

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపికి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబుకు వయసు మీద పడడంతో పార్టీని అంతకుముందున్న లాగా నడిపించకపోవచ్చని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారితో ఆయన బయట తిరగలేని పరిస్థితి. పైగా ఎన్నికల వాతావరణం కూడా కనిపించడం లేదు. ఒకవేళ స్థానిక ఎన్నికలు నిర్వహించిన కరోనా నిబంధనల ప్రకారం ఎక్కువగా బహిరంగ ప్రచారానికి అనుమతి దొరకదు. సోషల్‌ మీడియా ద్వారా ప్రచారానికే ప్రాధానత్య ఇచ్చుకోవాలని ఇప్పటికే బీహార్‌లో ఎన్నికల సంఘం ప్రకటించిన […]

Written By:
  • NARESH
  • , Updated On : October 20, 2020 / 08:47 AM IST
    Follow us on

    ఆంధ్రప్రదేశ్‌లో టీడీపికి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబుకు వయసు మీద పడడంతో పార్టీని అంతకుముందున్న లాగా నడిపించకపోవచ్చని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారితో ఆయన బయట తిరగలేని పరిస్థితి. పైగా ఎన్నికల వాతావరణం కూడా కనిపించడం లేదు.

    ఒకవేళ స్థానిక ఎన్నికలు నిర్వహించిన కరోనా నిబంధనల ప్రకారం ఎక్కువగా బహిరంగ ప్రచారానికి అనుమతి దొరకదు. సోషల్‌ మీడియా ద్వారా ప్రచారానికే ప్రాధానత్య ఇచ్చుకోవాలని ఇప్పటికే బీహార్‌లో ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీని నడిపించే సత్తా లోకేశ్‌లో ఉందా..? అనే చర్చ సాగుతోంది.

    మొదటి నుంచి రాజకీయానుభవం లేని లోకేశ్‌కు అంతకుముందు ఒకే సారి మంత్రి పదవి కట్టబెట్టడంతో ఆయన ఫెయిల్యూర్ వల్ల ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. గత ఎన్నికల్లో లోకేశ్‌ మంత్రి పదవి స్థానంలో ఉండి చేసిన వ్యాఖ్యలు పార్టీని అప్రతిష్టపాలు చేశాయి. వెనుక నుంచి చంద్రబాబు కవర్‌ చేస్తున్నా మొత్తంగా సీనియర్‌ నాయకులపై ఈ వ్యాఖ్యలు దెబ్బ పడ్డాయనే చెప్పవచ్చు.

    గత ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లాకు వెళ్లిన లోకేశ్‌ అక్కడ సిట్టింగ్‌ ఎంపీ, ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, బుట్టా రేణుకలకే టికెట్‌ వస్తుందని చెప్పారు. ఈ వ్యాఖ్యలు టీజీ వెంకటేశ్‌ లాంటి సీనియర్‌ నాయకులను బాధించాయి. అయితే ఆ తరువాత లోకేశ్‌ చెప్పినా వారిద్దరికీ టికెట్‌ రాలేదు. దీంతో వారు వైసీపీలోకి మారారు. సీనియర్ల అసహనం, వైసీపీ ఆకర్షణలతో టీడీపీకి ఈ జిల్లాలో దారుణంగా నష్టం జరిగింది. మొత్తంగా ఈ వ్యవహారానికి లోకేశ్‌ కారణమని పార్టీ నాయకులు భావించారు.

    ప్రకాశం జిల్లాలోనూ లోకేశ్‌ రచ్చరచ్చ చేశారు. చీరాలలో పర్యటించిన ఎమ్మెల్యే అయిన ఆమంచి కృష్ణ మోహన్‌కు వ్యతిరేకంగా మాట్లాడారు. పోతుల సునీత వర్గంతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చంద్రబాబు మాత్రం వీరిద్దరిని కాదని కరుణం బలరాంకు టికెట్‌ ఇచ్చారు. ఈ కారణంతో ఆమంచి కృష్ణమోహన్‌, పోతుల సునీతలు వైసీపీలో జాయిన్‌ అయ్యారు. ఇలా లోకేశ్‌ వ్యవహారంతో పార్టీకి తీవ్ర నష్టం వచ్చినట్లు కొందరు నాయకులు చెబుతున్నారు.