https://oktelugu.com/

‘ఆదిపురుష్’ సినిమాపై ఆసక్తికర అప్డేట్

ప్రభాస్.. బాహుబలి దెబ్బకు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాడు. ప్రస్తుతం బాహుబలి తర్వాత అన్నీ ప్యాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. సాహో తర్వాత రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ వంటి భారీ ప్యాన్ ఇండియా మూవీలు అనౌన్స్ చేశాడు. రాధేశ్యామ్ రిలీజ్ కు రెడీ కాగా.. సలార్, ఆదిపురుష్ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ దర్శకుడు ఔం రౌత్ తీస్తున్న ‘ఆదిపురుష్’పై భారీ అంచనాలున్నాయి. 3డీ టెక్నాలజీతో తీస్తున్న […]

Written By:
  • NARESH
  • , Updated On : April 20, 2021 / 12:55 PM IST
    Follow us on

    ప్రభాస్.. బాహుబలి దెబ్బకు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాడు. ప్రస్తుతం బాహుబలి తర్వాత అన్నీ ప్యాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. సాహో తర్వాత రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ వంటి భారీ ప్యాన్ ఇండియా మూవీలు అనౌన్స్ చేశాడు.

    రాధేశ్యామ్ రిలీజ్ కు రెడీ కాగా.. సలార్, ఆదిపురుష్ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ దర్శకుడు ఔం రౌత్ తీస్తున్న ‘ఆదిపురుష్’పై భారీ అంచనాలున్నాయి. 3డీ టెక్నాలజీతో తీస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.

    అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఏదో ఒక వివాదం చుట్టుముడుతూనే ఉంది. తాజాగా మరో ఆసక్తికర వార్త బాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

    ‘ఆదిపురుష్’ సినిమా ఇప్పటికే దాదాపు 30శాతం షూటింగ్ పూర్తయ్యిందని.. సినిమాలోని ప్రధాన పాత్రధారులపై షూటింగ్ కంప్లీట్ చేశారని భోగట్టా. ఈ సినిమా కోసం ప్రభాస్, సైఫ్ అలీఖాన్ అద్భుతమైన బాడీ మెయింటేన్ చేస్తున్నారని సమాచారం. ఇక సీతగా కృతి జీవించేస్తోందంటున్నారు.

    ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు. కృతి సనన్ సీతగా కనిపిస్తోంది. సన్నీసింగ్ లక్ష్మణుడి పాత్ర పోషిస్తున్నాడు. సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటిస్తున్నాడు. వచ్చే ఏడాది ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే 30 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యిందని.. విజువల్ ఎఫెక్ట్ పనులు ఇప్పుడు నడుస్తున్నాయని తెలుస్తోంది.