https://oktelugu.com/

దుబ్బాకలో హరీశ్‌ సీక్రెట్‌ టాస్క్‌?

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అన్ని పార్టీలూ దూసుకెళ్తున్నాయి. దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలకు ఏ మాత్రం ఛాన్స్‌ ఇవ్వద్దని అధికారి పార్టీ పక్కా వ్యూహాలతో ముందుకెళ్తోంది. ఉప ఎన్నికలకు ఇన్‌చార్జి అన్నట్లుగా బాధ్యతలు మీదేసుకున్న హరీశ్‌రావు తనదైన శైలిలో పార్టీ అభ్యర్థి గెలుపునకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఇందులో భాగంగా ఓ సీక్రెట్‌ టాస్క్‌ను అమల్లోకి తెచ్చినట్లు తెలుస్తోంది. అధికార పార్టీకి గెలుస్తామనే ధీమా ఉన్నా.. ఏ చిన్న లోపం వల్ల కూడా అభ్యర్థికి నష్టం […]

Written By:
  • NARESH
  • , Updated On : October 18, 2020 11:08 am
    Follow us on

    దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అన్ని పార్టీలూ దూసుకెళ్తున్నాయి. దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలకు ఏ మాత్రం ఛాన్స్‌ ఇవ్వద్దని అధికారి పార్టీ పక్కా వ్యూహాలతో ముందుకెళ్తోంది. ఉప ఎన్నికలకు ఇన్‌చార్జి అన్నట్లుగా బాధ్యతలు మీదేసుకున్న హరీశ్‌రావు తనదైన శైలిలో పార్టీ అభ్యర్థి గెలుపునకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.

    ఇందులో భాగంగా ఓ సీక్రెట్‌ టాస్క్‌ను అమల్లోకి తెచ్చినట్లు తెలుస్తోంది. అధికార పార్టీకి గెలుస్తామనే ధీమా ఉన్నా.. ఏ చిన్న లోపం వల్ల కూడా అభ్యర్థికి నష్టం జరగకూడదనే ఉద్దేశంతో ఆయన ‘ప్రైవేట్‌’ వేగులను రంగంలోకి దించారు. ప్రభుత్వ నిఘావర్గాలకు వీరు అదనం అనే చెప్పాలి. వచ్చే నెల 3న దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్‌ జరుగనుంది.

    Also Read:మీడియా మితిమీరిపోతోందా..? ప్రభుత్వం అడ్డుకోలేదా!

    టీఆర్‌ఎస్‌ తరఫున సోలిపేట సుజాతారామలింగారెడ్డి పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్‌ నుంచి చెరుకు శ్రీనివాస్‌ రెడ్డి, బీజేపీ నుంచి రఘునందన్‌రావు బరిలో ఉన్నారు. సిట్టింగ్‌ స్థానాన్ని పదిలపరుచుకోవాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. నియోజకవర్గంలోని మండలానికి, గ్రామానికి,100 మంది ఓటర్లకు ఇన్‌చార్జీలను నియమించారు. దుబ్బాక గెలుపు నల్లేరు మీద నడకలా భావిస్తున్న మంత్రి హరీశ్‌ రావు.. మెజార్టీ పైనే దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ఆ దిశగానే తన కార్యాచరణను అమలు చేస్తున్నారు.

    ఇందులో భాగంగా యూత్‌ను ప్రధానంగా నమ్ముకున్నట్లు తెలుస్తోంది. తనకు నమ్మకస్తులైన 20 మంది చాకుల్లాంటి కుర్రాళ్లను నాలుగైదు బృందాలుగా విభజించారు. ఈ బృందాలన్నీ దుబ్బాక నియోజకవర్గంలో పర్యటిస్తున్నాయి. ఒక్కో బృందం రోజూ ప్రతి మండలంలో ఐదారు గ్రామాలను రహస్యంగా చుట్టి వస్తోంది. బృంద సభ్యులు సాదాసీదాగా గ్రామాలకు వెళ్లి, జనం నుంచి అక్కడి పరిస్థితులను తెలుసుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ నేతల కదలికలపైనా ఆరా తీస్తున్నారు. పగలంతా తిరిగే ఈ బృందాలు రాత్రికి గ్రామాల వారీగా హరీశ్‌రావుకు నివేదికను అందిస్తున్నాయి. వాటి ఆధారంగా హరీశ్‌ సమస్యలు తీర్చుతున్నారు. మాట్లాడాల్సిన వారితో మాట్లాడేస్తున్నారు. లేకపోతే స్థానిక పార్టీ ఇన్‌చార్జీలను పురమాయిస్తున్నారు.

    Also Read: ప్రాజెక్టుల్లో వరుస ప్రమాదాలు.. కేసీఆర్ ను వదలడం లేదే?

    ఇలా ప్రత్యర్థి పార్టీల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే పావులు కదుపుతూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. గతంలోనూ సిద్దిపేటలో హరీశ్‌రావు ఇదే మంత్రాంగాన్ని ప్రయోగించారు. అందుకే లక్ష ఓట్ల మెజార్టీ సాధించగలిగారు. దుబ్బాక నియోజకవర్గంలోన మిరుదొడ్డి, తొగుట, చేగుంట, నార్సింగి, దౌల్తాబాద్‌, రాయపోల్‌, దుబ్బాక మండలాల్లో 1,97,468 మంది ఓటర్లు ఉన్నారు. 100 మంది ఓటర్లకు ఒకరి చొప్పున.. 1500 మందికి పైగా నాయకులు ఈ ఎన్నికల్లో పనిచేస్తున్నారు. మరోవైపు ప్రత్యర్థి అభ్యర్థులు కూడా ఈ ఎన్నికను ఛాలెంజ్‌గానే తీసుకుంటున్నారు. మరి చివరికి ఓటర్లు ఎవరి వైపు తీర్పునిస్తారు..? ఎవరికి ఎంతవరకు మెజార్టీ ఇస్తారో తెలియకుండా ఉంది.