https://oktelugu.com/

ప్రజల్లో కరోనా భయం పోయిందా..?

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఎక్కడో చైనాలోని వూహాన్‌లో పుట్టిన వైరస్‌ గ్రామ స్థాయి వరకు చేరింది. మన దేశంలో అయితే.. లక్షలాది మంది వైరస్‌ బారిన పడుతుండగా.. చనిపోతున్న వారి సంఖ్య కూడా లక్షకు పైగానే నమోదయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విజృంభిస్తోంది. అటు ఏపీలో అయితే లెక్కకు మించి కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో మాత్రం ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. జూన్ మొద‌టి వారంలో సింగిల్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 18, 2020 / 10:49 AM IST
    Follow us on

    కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఎక్కడో చైనాలోని వూహాన్‌లో పుట్టిన వైరస్‌ గ్రామ స్థాయి వరకు చేరింది. మన దేశంలో అయితే.. లక్షలాది మంది వైరస్‌ బారిన పడుతుండగా.. చనిపోతున్న వారి సంఖ్య కూడా లక్షకు పైగానే నమోదయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విజృంభిస్తోంది. అటు ఏపీలో అయితే లెక్కకు మించి కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో మాత్రం ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. జూన్ మొద‌టి వారంలో సింగిల్ డిజిట్ స్థాయిలో కేసులు బ‌య‌ట‌ప‌డ‌గా.. జూన్, జూలై, ఆగ‌స్టు నెల‌ల్లో క‌రోనా కేసుల సంఖ్య విప‌రీతంగా పెరిగింది.

    Also Read:మీడియా మితిమీరిపోతోందా..? ప్రభుత్వం అడ్డుకోలేదా!

    జూలైకి వచ్చే సరికి భయానక పరిస్థితులే కనిపించాయి. రాయ‌ల‌సీమలోని నాలుగు జిల్లాల్లోనూ ఒక్కో జిల్లాలో రోజుకు వెయ్యికి అటుఇటుగా కేసులు నమోదయ్యాయి. లాక్ డౌన్ మిన‌హాయింపులు మొద‌ల‌య్యాకా నాలుగు జిల్లాల్లోనూ కేసుల సంఖ్య ఒకే స్థాయిలో పెరుగుతూ పోయింది. మినహాయింపులతో కేసులు వేగంగా పెరిగాయి. దీంతో మ‌ళ్లీ లాక్ డౌన్‌ పెట్టాల్సిన పరిస్థితే వచ్చింది. కేసుల తీవ్రత‌ను ప‌ట్టి ఒక్కో టౌన్లలో లాక్‌డౌన్‌ అమలు చేశారు.

    టౌన్లను దాటి వైరస్‌ పల్లెలనూ తాకడంతో అక్కడా పదుల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఆగస్టు వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. అటు క‌రోనా భ‌యం, ఇటు లాక్ డౌన్ తో రాయ‌ల‌సీమ ప్రజానీకం తీవ్ర ఇబ్బందుల పాలైంది. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చింది.

    Also Read: ప్రజలను సోమరులను చేస్తున్నారా?

    ఏపీలో రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుతుండడం.. రికవరీ రేటు పెరుగుతుండడంతో ప్రజలు బయట కనిపిస్తున్నారు. ఒకప్పుడు రోజుకు వెయ్యి కేసులు న‌మోదైన జిల్లాల్లో.. ఇప్పుడు రెండు వంద‌లు కూడా రావడం లేదు. దీనికితోడు 90 శాతం రిక‌వ‌రీ క‌నిపిస్తున్నాయి. దీంతో ప్రజల్లో ఒక్కసారిగా కరోనా భయం తొలగిపోయినట్లైంది. ధైర్యంగా బ‌య‌ట తిరుగుతున్నారు. మాస్కులు కొంద‌రు ధ‌రిస్తున్నారు, మ‌రికొంద‌రేమో పట్టించుకోవడం లేదు. మొన్నటివరకు బోసిపోయిన స్ట్రీట్ ఫుడ్ సెంటర్ల ద‌గ్గరా ప్రజలు కనిపిస్తూనే ఉన్నారు. పానీపురీ బండ్ల వ‌ద్ద జ‌నాలే జనాలు. ఇలా క‌రోనా భయం నుంచి జ‌నాలు పూర్తిగా బ‌య‌ట‌ప‌డ్డారు.