Political Survey in AP : ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసారి గెలుపు ఎవరిది? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. మరోసారి ఛాన్స్ అంటున్న జగన్ ను ప్రజలు గెలిపిస్తారా? లాస్ట్ ఛాన్స్ అంటున్న చంద్రబాబు మొర ఆలకిస్తారా? ‘ఒక్క ఛాన్స్ ’ అంటున్న పవన్ కళ్యాణ్ కు ఛాన్స్ ఇస్తారా? ఈ ముగ్గురి సంకుల సమరం ఆసక్తి రేపుతోంది. ఈ మూడు పార్టీలకు పైన కేంద్రంలోని బీజేపీ కీరోల్ పోషిస్తోంది. ప్రస్తుతానికి జనసేనతో తోడుగా నడుస్తున్న బీజేపీ హంగ్ వస్తే మాత్రం ఇక్కడ కింగ్ మేకర్ పాత్రను పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ క్రమంలోనే జాతీయ స్థాయిలో చాలా విశ్వసనీయత ఉన్న రెండు సర్వేల రిపోర్ట్ తాజాగా లీక్ అయ్యింది. ఒకప్పటి కాంగ్రెస్ నేత గోనె ప్రకాష్ రావు ఈ విషయాన్ని బయటపెట్టాడు. తనకు వైసీపీ శత్రువు కాదని.. టీడీపీ మిత్రుడు కాదని.. తెలంగాణకు చెందిన తాను ఏపీ ఫలితాల సర్వేను చూసి చెబుతున్నట్టు గోనె తెలిపారు.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. జాతీయ స్థాయిలో పేరెన్నిక గల సర్వే సంస్థ- చానెల్స్ కలిసి చేసిన ఏపీ సర్వేలో టీడీపీకి ఉత్తరాంధ్రలో 34 సీట్లు వస్తాయని తేలింది. ఇక జనసేనతో టీడీపీ కలిస్తే 34 గ్యారెంటీ అని.. జనసేనతో పొత్తు పెట్టుకోకపోతే 20 సీట్లు టీడీపీకి వస్తాయని తేలిందట.. టీడీపీతో జనసేన కలవకుంటే 20 సీట్లు టీడీపీకి, 4-5 సీట్లు జనసేనకు వస్తాయని తేలింది.
అలాగే ఈస్ట్ గోదావరిలో టీడీపీకి 19 సీట్లు, వెస్ట్ గోదావరిలో 15 సీట్లు గ్యారెంటీ అని తేలింది. పశ్చిమగోదావరిలో 15కు 15 సీట్లు క్లీన్ స్వీప్ అని.. తూర్పుగోదావరిలో ఒక్క తుని సీటు తప్ప అన్ని టీడీపీ గెలుస్తుందని తేలింది. నెల్లూరులో టీడీపీకి 10 సీట్లు, రాయలసీమ 4 జిల్లాల్లో 33 సీట్లు వైసీపీకి వస్తాయని తేలింది. టీడీపీకి సీమలో కేవలం 20 సీట్లలోపే వస్తాయని.. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రభావం రాయలసీమలో అస్సలు ఉండదని గోనె వివరించారు.
ఇక కృష్ణ, గుంటూరు, ప్రకాషం జిల్లాల సర్వే రిపోర్టులు అందాల్సి ఉన్నాయని.. ఇదంతా నవంబర్ 18లోపు చేసిన సర్వేలు అని గోనె బయటపెట్టారు.
పవన్ కళ్యాణ్ -చంద్రబాబు కలిస్తే ఏపీలో వారిద్దరిదే అధికారం అని సర్వేలో తేలిందని గోనె తెలిపారు. కలవకపోతే సీట్లు భారీగా తగ్గుతాయని వివరించారు. సీఎం అయ్యే అవకాశాలు చంద్రబాబుకే ఎక్కువని తేలుతోంది. అయితే పవన్ కళ్యాణ్ మద్దతుతోనే అది సాధ్యం. పవన్ కింగ్ మేకర్ అయితే ఆయనకు సీఎం అవకాశాలు ఉంటాయి.