https://oktelugu.com/

గబ్బర్ సింగ్ కాంబో రిపీట్.. రేటు పెంచిన డీఎస్పీ..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ మూవీ టాలీవుడ్లో సెన్సేషనల్ హిట్టయింది. అప్పటివరకు టాలీవుడ్లో ఉన్న రికార్డులన్నీ తిరగరాసి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. పవన్ కల్యాణ్ అభిమాని అయిన డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ మ్యానరిజానికి దృష్టిలో ఉంచుకొని ఈ సినిమా తెరకెక్కించాడు. Also Read: అయ్యా బాబోయ్.. స్టైలీష్ స్టార్ ఇలా అయ్యాడెంటీ.. ఫ్యాన్స్ తట్టుకోగలరా? ఈ మూవీలో పవన్ కల్యాణ్ సరసన శృతిహాసన్ నటించింది. ఈ మూవీకి దేవిశ్రీ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 11, 2020 / 05:10 PM IST
    Follow us on

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ మూవీ టాలీవుడ్లో సెన్సేషనల్ హిట్టయింది. అప్పటివరకు టాలీవుడ్లో ఉన్న రికార్డులన్నీ తిరగరాసి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. పవన్ కల్యాణ్ అభిమాని అయిన డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ మ్యానరిజానికి దృష్టిలో ఉంచుకొని ఈ సినిమా తెరకెక్కించాడు.

    Also Read: అయ్యా బాబోయ్.. స్టైలీష్ స్టార్ ఇలా అయ్యాడెంటీ.. ఫ్యాన్స్ తట్టుకోగలరా?

    ఈ మూవీలో పవన్ కల్యాణ్ సరసన శృతిహాసన్ నటించింది. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే బాణీలను అందించి చిత్ర విజయంలో తనవంతు పాత్ర పోషించారు. గబ్బర్ సింగ్ పాటలు ఇప్పటికీ కూడా ట్రెండింగ్ అవుతూనే ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ గతంలోనూ పవన్ నటించిన పలు సినిమాలకు సూపర్ హిట్ మ్యూజిక్ అందించాడు.

    జల్సా.. గబ్బర్ సింగ్.. అత్తారింటికి దారేది.. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలకు దేవీశ్రీ ప్రసాద్ అదిరిపోయే సాంగ్స్ ఇచ్చాడు. పవన్ ఫ్యాన్స్ ను చిరకాలం గుర్తుండిపోయే ఎన్నో సాంగ్స్ ను దేవిశ్రీ ప్రసాద్ అందించాడు. తాజాగా హరీష్ శంకర్- పవన్ కాంబోలో సినిమా రాబోతుండగా ఈ సినిమా కూడా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నాడు.

    Also Read: కాజల్ ముందుచూపు.. సైడ్ బిజినెస్ షూరు..!

    పవన్ కల్యాణ్ 28వ మూవీని దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించనున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. ఈ మూవీ 2022లో సెట్స్ పైకి వెళ్లనుండగా దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమా కోసం అదిరిపోయే పారితోషికం అందుకోనున్నాడు. దేవిశ్రీ ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ కోసం కోటిన్నర తీసుకుంటున్నాడని సమాచారం.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ఇక పవన్ కల్యాణ్-హరీష్ శంకర్ కాంబోలో రానున్న మూవీకి మ్యూజిక్ అందించేందుకు డీఎస్పీ ఏకంగా రెండు కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేశాడు. అతడి కెరీర్లో అదే అత్యధిక పారితోషకమని తెలుస్తోంది. ఏదిఏమైనా గబ్బర్ సింగ్ కాంబో మళ్లీ రిపీట్ కానుండటంతో పవన్ ఫ్యాన్స్ మాత్రం ఖుషీ అవుతున్నారు.