Homeజాతీయ వార్తలు‘దుబ్బాక ఉప ఎన్నిక’: హరీశ్ రావుకే బాధ్యతల వెనుక..?

‘దుబ్బాక ఉప ఎన్నిక’: హరీశ్ రావుకే బాధ్యతల వెనుక..?

Harish Rao

దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపు కోసం హరీశ్ రావు అహర్నిశలు శ్రమించాడు. కానీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో మంచోడనిపించుకున్న హరీశ్ రావును కూడా దుబ్బాక ప్రజలు విశ్వసించలేదు. దీంతో ఇప్పడు టీఆర్ఎస్ ఓటమిని హరీశ్ రావుపై నెట్టెస్తున్నారందరు. మంత్రి కూడా ప్రచారంలో దుబ్బాక అభివ్రద్ధి బాధ్యత నాదే అని చెప్పి, ఓడిన తరువాత ఓటమికి నాదే బాధ్యత అని ప్రకటించాడు.

Also Read: దుబ్బాక ఎన్నికతో చంద్రబాబు కదలిక..!

ఈ తరుణంలో కేసీఆర్ ముందే ప్లాన్ వేసి హరీశ్ రావును బలిపశువును చేశాడని కొందరు నాయకులు గుసగుసలు పెట్టుకుంటున్నారు. అంతకుముందు సిద్ధిపేట జిల్లాలో జరిగిన ప్రతీ ఎన్నికలోనూ హరీశ్ రావుకే బాధ్యతలు అప్పగించారు కేసీఆర్. అయితే  దుబ్బాకలో నోటిఫికేషన్ రాకముందు నుంచే టీఆర్ఎస్ ప్రభుత్వం దుబ్బాకను పట్టించుకోలేదన్న ఆరోపణలను ఎదుర్కొంది. ఈ తరుణంలో కేసీఆర్ వెళ్లి ప్రచారం చేసి ఓడిపోతే విలువ ఉండదని ముందే ఊహించనట్లు తెలుస్తోంది. దీంతో ఒకవేళ దుబ్బాకలో గెలిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు పనిచేశాయని, ఓడిపోతే హరీశ్రావు ప్రజలను ఆకట్టుకోలేదనే మలుపు తిప్పవచ్చని అనుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: రఘునందన్ పై కేసీఆర్ బ్రహ్మస్త్రం పనిచేయలేదా..?

2018 ఎన్నికల తరువాత కేబినేట్ విస్తరణలో కొన్ని నెలలపాటు హరీశ్ రావును మంత్రి వర్గంలో చేర్చుకోలేదు. దీంతో పార్టీలోని కొందరి నాయకుల నుంచి తీవ్రంగా విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా సిద్ధిపేట జిల్లాలోని కొన్ని చోట్ల పార్టీకి ఎదురు దెబ్బలు తగిలాయి. దీంతో పరిస్థితిని గమనించిన కేసీఆర్ వెంటనే కేబీనెట్ ను విస్తరించి హరీశ్ రావుకు ఆర్థిక శాఖను అప్పగించారు.

తాజగా కేబినేట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కుటుంబ పాలన అని పేరు తెచ్చుకున్నకేసీఆర్ కుటుంబ సభ్యులందరూ మంత్రి పదవుల్లో ఉన్నారు. తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నికైన కవితకు మంత్రి పది లేదు. అందువల్ల కవితకు మంత్రి పదవి ఇవ్వాలంటే ఎవరి తొలగించాలన్నఆలోచనలో కేసీఆర్ ఉన్నాడట. ఇదివరకు మంత్రి పదవి ఊడే వార్ల లిస్టులో గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరుల పేర్లు విపించాయి.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

ఏదో ఒక కారణంతో మంత్రి పదవిని తప్పించాలనే ఉద్దేశంలో హరీశ్ రావును దుబ్బాక ఎన్నికల బాధ్యతలను అప్పగించారని చర్చ మొదలైంది. దుబ్బాకలో ఓడిపోతామని ముందే తెలిసిన కేసీఆర్ హరీశ్ రావుకే అప్పగించడంపై చర్చ జరుగుతోంది. దీంతో భవిష్యత్తులో హరీశ్ రావుకు మంత్రి పదవి ఉంటుందోలేదోనని అనుకుంటున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version