వైఎస్ వివేకానంద హత్యకు సంబంధించిన రికార్డులను సీబీఐకి వెంటనే ఇవ్వాలని ఏపీ హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. వివేకా హత్యకు సంబంధించిన డాక్యుమెంట్లు తమకు ఇవ్వాలని సీబీఐ అధికారులు పెలివెందుల మెజిస్ట్రేట్ కోర్టులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే తమకు పై నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని, డాక్యుమెంట్లు ఇవ్వడం కుదరదని పెలివెందుల కోర్టు తెలిపింది. దీంతో సీబీఐ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు వివేకా హత్యకు సంబంధించిన ఫైళ్లను సీబీఐ అధికారులకు అప్పగించాలని పులివెందుల కోర్టు ఆదేశించింది.