Homeఎంటర్టైన్మెంట్Sankranti 2027 Senior Heroes: 2027 సంక్రాంతి బరిలో నిలుస్తున్న నలుగురు సీనియర్ హీరోలు......

Sankranti 2027 Senior Heroes: 2027 సంక్రాంతి బరిలో నిలుస్తున్న నలుగురు సీనియర్ హీరోలు… గెలిచేదెవరు..?

Sankranti 2027 Senior Heroes: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాలుగు పిల్లర్లుగా పిలుచుకునే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది… గత 50 సంవత్సరాల నుంచి ఈ నలుగురు హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ మధ్యకాలంలో వీళ్ళ నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నప్పటికి ఈ నలుగురి మధ్య పోటీ అయితే ఈ మధ్యకాలంలో జరగలేదు. ఇక 2027 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా ఈ నలుగురు హీరోలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సంవత్సరం సంక్రాంతికి వచ్చిన చిరంజీవి ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు.

ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో సీనియర్ హీరోలందరిలో తను టాప్ పొజిషన్ లోకి వెళ్ళాడు. ఇక వచ్చే సంవత్సరం చిరంజీవి బాబీ తో చేస్తున్న సినిమాతో సంక్రాంతి బరిలో నిలుస్తున్నాడు. ఇక బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో సంక్రాంతి ని టార్గెట్ చేశాడు.

ఇక రీసెంట్ గా అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు నాగార్జున కళ్యాణ్ కృష్ణ కాంబోలో ఒక సినిమా రాబోతుందని ట్వీట్ చేశారు. అలాగే ఈ మూవీ 2027 జనవరి 15వ తేదీన సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ వాళ్ళు ఆ ట్వీట్ లో క్లారిటీ ఇచ్చారు…ఇక వెంకటేష్ సైతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్న సినిమాతో సంక్రాంతి బరిలో నిలుస్తున్నాడు…

ఇక ఏది ఏమైనా కూడా నలుగురు సీనియర్ హీరోలు ఒక్కసారి సంక్రాంతి బరిలో నిలవడం అనేది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరి అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే హీరోలందరి సినిమాల షూటింగులు శరవేగంగా పూర్తిచేసుకుని సంక్రాంతి బరిలో నిలుస్తారా? ఒకవేళ వీళ్లు సంక్రాంతికి వస్తే స్టార్ హీరోలందరు సైడ్ అయిపోవాల్సిందేనా..? ఈ నలుగురిలో ఎవరు సంక్రాంతి విన్నర్ గా నిలుస్తారు. అసలైన పోటీ ఇప్పుడే జరగబోతుందా? అనే విషయాల మీద సైతం క్లారిటి రావాల్సి

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular