పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పుడు, తాను మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళనని చెప్పాడు. తన జీవితమంతా రాజకీయాలకు అంకితం చేస్తానని హామీ ఇచ్చారు.
Also Read: గజగజ వణుకుతున్న ఢిల్లీ.. రైతన్న పరిస్థితేంటీ?
కానీ ఇప్పుడు అతను సినిమాలకు ఎక్కువ అంకితమిచ్చాడు. జనసేన బాధ్యతలను పూర్తిగా ఆ పార్టీలో నంబర్ 2 అయిన నాదెండ్ల మనోహర్ చేతిలో పవన్ పెట్టాడు.
అందరికీ తెలిసినట్లుగా మనోహర్ ఇప్పుడు జనసేనలో 2 వ స్థానంలో ఉన్నాడు. వాస్తవానికి కేడర్‌లో వీరిద్దరూ తప్పితే వేరే వ్యక్తి ఇంతవరకు తెలియదు.
మనోహర్ బ్యాక్ గ్రౌండ్ చూస్తే జనసైనికుల్లో కాస్త భయపెట్టేలా ఉందన్న చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది. ఇప్పటికే రెండుసార్లు ఎన్టీఆర్, చంద్రబాబును పదవీచిత్యులను చేసిన కుటుంబానికి చెందిన వారు కావడంతో ఈ గుబులు నెలకొంది.
Also Read: విజృంభిస్తున్న కరోనా కొత్త స్ట్రెయిన్.. కేసులెన్నంటే?
నాదెండ్ల మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కర రావు నాడు ఎన్టీఆర్ ను పదవి నుంచి దించేశాడు. చంద్రబాబు నాయుడును కూడా ఇదే నాదెండ్ల మనోహర్ వెన్నుపోటు పొడిచి సీఎం సీటు ఎక్కాడు. అయితే నాదెండ్ల మనోహర్ మాత్రం అలాంటి పనులు చేయడని జనసేన క్యాడర్ గట్టి నమ్మకంతో ఉంది. ఆయన ట్రాక్ రికార్డ్ కూడా బాగుంది. పవన్ కళ్యాణ్‌కు వెన్నుదన్నుగా ఉంటున్న నాదెండ్ల ఇప్పుడు పార్టీని ఓన్ చేసుకొని జనసేనలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పవన్ ను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కునే శక్తి, నడిపించే సామర్థ్యాలు నాదెండ్లకు ఉన్నాయా? అంటే డౌటే అంటున్నారు. పవన్ తోనే కానిది నాదెండ్లతో జనసేనను పైకి తేవడం కష్టమంటున్నారు విశ్లేషకులు.. జనసైనికులు..
అయితే సోషల్ మీడియాలో ఇలా నాదెండ్ల మనోహర్ పై జరుగుతున్న ప్రచారం అభిమానుల్లో భయానికి కారణమవుతోంది.కానీ నాదెండ్ల మాత్రం తన విధేయతతో దీన్ని తప్పు అని నిరూపిస్తారా? లేదా అన్నది చూడాలి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్