ఏదైనా ఒక ఊరిలో ఎన్ని ఇల్లు ఉన్నాయో తెలుసుకోవాలంటే వాటిని గడప ఆధారంగా లెక్క పెడుతుంటారు.ఫలానా ఊర్లో ఇన్ని గడపలు ఉన్నాయని చెబుతుండడం మనం వినే ఉంటాం. మన పూర్వీకులు భూమికి, ఆకాశానికి మధ్య హద్దుగా ఈ గడపను పెట్టారని శాస్త్రాలు చెబుతుంటాయి. రాక్షస రాజైనా హిరణ్యకశిపుని సాక్షాత్తు ఆ లక్ష్మీనరసింహస్వామి గడప పై కూర్చుని అంతమొందించాడు. అందుకే గడపను సాక్షాత్తు లక్ష్మీదేవి భావిస్తుంటారు. అందుకోసమే గడపపై తొక్క కూడదని, గడప పై తుమ్మ కూడదని మన పెద్దలు చెబుతుంటారు.
Also Read: ఇంటికి కిటికీలు, గుమ్మాలు బేసి సంఖ్యలో ఉండకూడదా..?
సాక్షాత్తు ఆ మహాలక్ష్మిగా భావించే మన ఇంటి గడపకు పసుపు రాసి బొట్లు పెడుతుంటారు.ఇలా పెట్టడం వల్ల ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుందని విశ్వాసం. ఈ విధంగా భక్తితో గడపకు పసుపు రాసి బొట్లు పెట్టడం ఒక ఆచారంగా భావిస్తున్నారు. అంతేకాకుండా గడపకు బొట్లు పెట్టడం వల్ల మనకు ప్రాణ రక్షణ కూడా ఉంటుందని సైన్స్ చెబుతోంది.
Also Read: నల్ల బియ్యం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?
సాధారణంగా పల్లెటూర్లలో ఇళ్లను తోటలలో నిర్మించుకుంటారు.అలాంటప్పుడు పొలాలలో నుంచి వచ్చే ఏవైనా విష పురుగులు ఇంటి లోనికి ప్రవేశించకుండా ఈ పసుపులో ఉన్న ఔషధ గుణాలు క్రిమికీటకాలను లోపలికి రానీయకుండా కాపాడుతుంది. అంతేకాకుండా గడపకు వేసే చెక్క తొందరగా చెదలు పట్టి పాడవుతుంది. పసుపును రాయడం వల్ల అందులో ఉన్న యాంటీబయోటిక్స్ వల్ల చెదపురుగులు నివారణ జరిగే గడప ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. అందుకోసమే మన పూర్వీకులు గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టేవారు. ప్రస్తుతం అదే ఆచారంగా నేటి తరం వరకూ కొనసాగుతూనే వస్తోంది.
మరిన్ని వార్తల కోసం: ప్రత్యేకం