Chandramohan passed away : సీనియర్ నటుడు చంద్రమోహన్ తుదిశ్వాస విడిచాడు. అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమోహన్ హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచాడు. దిగ్గజ నటుడి మరణంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. చంద్రమోహన్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. సోమవారం హైదరాబాద్లో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
కృష్ణా జిల్లా పమిడిముక్కలలో చంద్రమోహన్ 1942 మే 23న జన్మించారు. ఈయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడు. కథానాయకుడిగా 175 పైగా సినిమాల్లో నటించాడు. మొత్తం 932 సినిమాల్లో నటించాడు. చాలా వరకూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేశాడు. 1966లో రంగులరాట్నం చిత్రంతో ఇతని సినీ ప్రస్థానం ఆరంభమైంది. శ్రీదేవి తన తొలి సినిమాను చంద్రమోహన్ హీరోగానే చేయడం విశేషం. తర్వాత ఫ్లాపులు రావడం.. అవకాశాలు తగ్గిపోవడంతో అప్పటి నుండి సహనాయకుడిగా, కథనాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుంటాడు.
కొత్త హీరోయన్‌లకు లక్కీ హీరోగా చంద్రమోహన్‌ను పేర్కొంటారు. సిరిసిరిమువ్వలో జయప్రద, పదహారేళ్ళ వయసులో శ్రీదేవి తమ నటజీవితం ప్రాంభంలో చంద్రమోహన్‌తోనే తొలి చిత్రంలో నటించి తరువాత తారాపథంలో ఉన్నత స్థాయికి చేరుకున్నాడు.
చంద్రమోహన్ చివరగా 2017లో ‘ఆక్సిజన్’ సినిమాలో నటించారు. ఆ తర్వాత అనారోగ్యంతో సినిమాలు చేయలేదు. వృద్ధాప్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1987లో ‘చందమామ రావే’ సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డును చంద్రమోహన్ దుకున్నారు. 2005లో ‘అతనొక్కడే’ సినిమాకు ఉత్తమ సహాయనటుడి అవార్డు దక్కింది.