దుర్గగుడి వెండి సింహాల కేసులో దొంగ దొరికాడు

విజయవాడ ఇందకీలాద్రి దుర్గమ్మ రథానికి ఉండే 3 వెండి విగ్రహాల మాయం ఏపీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. అప్పటికే ఏపీలో విగ్రహాలపై దాడులు దుమారం రేపుతున్న వేళ ఈ ఉదంతం మరింత సంచలనమైంది. ఈ కేసులో ఎట్టకేలకు దొంగ దొరికాడు.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పాత నేరస్థుడే ఈ చోరీకి పాల్పడినట్టు సమాచారం. Also Read: జగన్ కు మైండ్ బ్లాంక్.. ఏపీలో ఎన్నికలకు హైకోర్టు ఆదేశం గత సెప్టెంబర్ లో బెజవాడ దుర్గమ్మ […]

Written By: NARESH, Updated On : January 21, 2021 6:56 pm
Follow us on

silver-lion-idols

విజయవాడ ఇందకీలాద్రి దుర్గమ్మ రథానికి ఉండే 3 వెండి విగ్రహాల మాయం ఏపీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. అప్పటికే ఏపీలో విగ్రహాలపై దాడులు దుమారం రేపుతున్న వేళ ఈ ఉదంతం మరింత సంచలనమైంది. ఈ కేసులో ఎట్టకేలకు దొంగ దొరికాడు.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పాత నేరస్థుడే ఈ చోరీకి పాల్పడినట్టు సమాచారం.

Also Read: జగన్ కు మైండ్ బ్లాంక్.. ఏపీలో ఎన్నికలకు హైకోర్టు ఆదేశం

గత సెప్టెంబర్ లో బెజవాడ దుర్గమ్మ ఆలయంలోని రథానికి ఉన్న 3 వెండి విగ్రహాలు లభ్యమయ్యాయి. సీసీ కెమెరాలు లేకపోవడంతో ఈ కేసులో ఒక్క ఆధారం కూడా లభించలేదు. ఈ కేసులో తాజాగా పురోగతి కనిపించింది. ఇటీవల దొంగతనాల కేసులో బాలక్రిష్ణ అనే నిందితుడిని పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ సమయంలో దుర్గగుడిలో వెండి సింహాలను తానే దొంగతనం చేసినట్టు అతడు అంగీకరించినట్టు సమాచారం.

ప్రత్యేక బృందం ఇతడిని అదుపులోకి తీసుకొని కేసుకు సంబంధించిన కీలక విషయాలను రాబడుతున్నట్టు తెలుస్తోంది. వెండి సింహాలను దొంగిలించిన బాలక్రిష్ణ వాటిని తూర్పు గోదావరి జిల్లా తునికి చెందిన ఓ బంగారు వ్యాపారికి వీటిని విక్రయించాడని విచారణలో తేలినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ వ్యాపారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read: అఖిలప్రియ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. : కీ రోల్‌ ఆమెదేనట..!

నిందితుడి దగ్గర నుంచి ప్రతిమలను తీసుకున్న వ్యాపారి వెంటనే వాటిని కరిగించాడని.. వాటి బరువు దాదాపు 16 కిలోలు ఉందని చెబుతున్నారు.

అయితే ఈ విషయాన్ని పోలీసులు మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. ధ్రువీకరించడం లేదు. దుర్గగుడిలో మాత్రం దీనిపైనే చర్చ జరుగుతోంది. రెండు మూడురోజుల్లోనే దుర్గగుడి దొంగ అరెస్ట్ ను చూపించే అవకాశం ఉందని సమాచారం.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్