https://oktelugu.com/

బయటపడ్డ యాంకర్ ప్రదీప్ మరో కోణం !

బుల్లితెర ప్రేక్ష‌కుల‌నే కాదు వెండితెర వీక్ష‌కులను సైతం యాంకర్‌గా, యాక్టర్‌గా అలరిస్తోన్న ప్రదీప్.. తాజాగా తనలోని మానవీయ కోణాన్ని బయట పెట్టాడు. ప్రస్తుతం ప్రదీప్ జీ తెలుగులో ‘సరిగమప షో’ చేస్తున్నాడు. ఇక ఈ సింగింగ్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్‌ల‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక‌రు. త‌న‌దైన గొంతుతో మొద‌టి నుంచి ప‌వ‌న్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటూ వ‌స్తున్నాడు. అయితే పవన్ కల్యాణ్ ఆర్థిక పరిస్థితి అంతగా బాగోదట. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రదీప్.. అతడి చదువుకు కావాల్సిన ఖర్చును […]

Written By:
  • admin
  • , Updated On : January 21, 2021 / 11:09 AM IST
    Follow us on


    బుల్లితెర ప్రేక్ష‌కుల‌నే కాదు వెండితెర వీక్ష‌కులను సైతం యాంకర్‌గా, యాక్టర్‌గా అలరిస్తోన్న ప్రదీప్.. తాజాగా తనలోని మానవీయ కోణాన్ని బయట పెట్టాడు. ప్రస్తుతం ప్రదీప్ జీ తెలుగులో ‘సరిగమప షో’ చేస్తున్నాడు. ఇక ఈ సింగింగ్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్‌ల‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక‌రు. త‌న‌దైన గొంతుతో మొద‌టి నుంచి ప‌వ‌న్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటూ వ‌స్తున్నాడు. అయితే పవన్ కల్యాణ్ ఆర్థిక పరిస్థితి అంతగా బాగోదట. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రదీప్.. అతడి చదువుకు కావాల్సిన ఖర్చును స్వయంగా భరిస్తానని స్టేజ్ మీద నుంచి ప్రామిస్ చేశాడు.

    Also Read: దూసుకుపోతున్న రామ్ ‘రెడ్’.. మిగిలిన భాషల్లోకి కూడా !

    దీంతో జడ్జ్‌లు, మెంటర్లతో పాటు మిగిలిన వారంతా నిలబడి చప్పట్లు కొట్టి అతడిని అభినందించారు. నిజంగా ప్రదీప్ చేసిన ఈ సాయం ఒక కుటుంబానికి జీవితకాల విలువైనది. ఇక యాంక‌ర్ ప్ర‌దీప్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. వ్యాఖ్య‌త‌గా త‌నదైన పంచులు, సెన్సాఫ్ హ్యూమ‌ర్‌తో అద‌ర‌గొట్టే ప్ర‌దీప్.. సుమ త‌రువాత గొప్ప యాంక‌ర్‌గా పేరు సంపాదించుకున్నారు. పైగా ప్ర‌దీప్ ప్రస్తుతం హీరోగా కూడా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.

    Also Read: ఆ సినిమాలు రిలీజ్ అయ్యాక దైర్యం వచ్చిందట !

    కాగా ప్ర‌దీప్ హీరోగా న‌టించిన ’30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా’ సినిమా త్వ‌ర‌లో థియేట‌ర్ల‌లో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ మూవీ గనుక క‌చ్చితంగా విజ‌యం అందుకుంటే.. ఇక ప్రదీప్ కూడా హీరోగా కంటిన్యూ అవుతాడు. ఎలాగూ తన సినిమా సూపర్ హిట్ అవుతుందనే ధీమాలో ఉన్నాడు ప్ర‌దీప్. ఇక ప్రదీప్ అభిమానులు కూడా ఈ సినిమా విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నారు. మున్నా దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో ప్రదీప్ లవ్ గురూగా కనిపించనున్నాడు. ఈ చిత్రంలోని ‘నీలి నీలి ఆకాశం’ పాట ఆల్ టైం హిట్ అయింది. ఈ సినిమా జనవరి 29న విడుదల కాబోతుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్