https://oktelugu.com/

జగన్ కు మైండ్ బ్లాంక్.. ఏపీలో ఎన్నికలకు హైకోర్టు ఆదేశం

ఏపీలో సీఎంగా జగన్ గద్దెనెక్కినప్పటి నుంచి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ తో సాగుతున్న వైరానికి ఎట్టకేలకు హైకోర్టు చెక్ పెట్టింది. వీరిద్దరి ‘పంచాయితీ’ కారణంగా ఏపీలో పంచాయితీ ఎన్నికలు జరుగకుండా పోయాయి. Also Read: అఖిలప్రియ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. : కీ రోల్‌ ఆమెదేనట..! తొలుత సీఎం జగన్ గత మార్చి కరోనా కల్లోలంలో ఎన్నికలకు వెళ్లగా.. అర్ధాంతరంగా వాటిని ఎస్ఈసీ నిమ్మగడ్డ రద్దు చేశారు. కరోనాను బూచీగా చూపారు. ఇప్పుడు కరోనా తగ్గినవేళ ఎస్ఈసీ […]

Written By: , Updated On : January 21, 2021 / 11:01 AM IST
Follow us on

AP High Court

ఏపీలో సీఎంగా జగన్ గద్దెనెక్కినప్పటి నుంచి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ తో సాగుతున్న వైరానికి ఎట్టకేలకు హైకోర్టు చెక్ పెట్టింది. వీరిద్దరి ‘పంచాయితీ’ కారణంగా ఏపీలో పంచాయితీ ఎన్నికలు జరుగకుండా పోయాయి.

Also Read: అఖిలప్రియ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. : కీ రోల్‌ ఆమెదేనట..!

తొలుత సీఎం జగన్ గత మార్చి కరోనా కల్లోలంలో ఎన్నికలకు వెళ్లగా.. అర్ధాంతరంగా వాటిని ఎస్ఈసీ నిమ్మగడ్డ రద్దు చేశారు. కరోనాను బూచీగా చూపారు. ఇప్పుడు కరోనా తగ్గినవేళ ఎస్ఈసీ నిమ్మగడ్డ ఎన్నికలకు వెళుతుంటే జగన్ అడ్డుకుంటున్నాడు. గత చంద్రబాబు ప్రభుత్వంలో నియామకమైన నిమ్మగడ్డ సారథ్యంలో ఎన్నికలకు వెళ్లడానికి జగన్ సర్కార్ సిద్ధంగా లేదు.ఇప్పటికే ఆయన పోస్టును లేపేసినా కూడా కోర్టులకు వెళ్లి నిమ్మగడ్డ పునర్నియామకం అయ్యారు. అయితే తాజాగా నిమ్మగడ్డ సారథ్యంలోనే ఏపీలో పంచాయితీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చర్చనీయాంశమైంది.

ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని తాజాగా హైకోర్టు సంచలన ఆదేశాలిచ్చింది. వ్యాక్సినేషన్ తో ఎన్నికలకు సంబంధం లేదని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది వేచిచూడాలి.

Also Read: త్వరలోనే విశాఖకు రాజధాని తరలింపు..: ఆ మంత్రులు చెప్పేశారుగా..

ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలపై ఏడాదిన్నరగా కొనసాగుతున్న ‘పంచాయితీ’కి హైకోర్టులో శుభం కార్డు వేసింది. తాజాగా పంచాయితీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు తీర్పు వెలువరించింది. హైకోర్టులో   ఎస్ఈసీ అప్పీల్ పై రెండు రోజులుగా వాదనలు విన్న హైకోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది. కొద్దిసేపటి క్రితమే ఏపీ హైకోర్టు ఏపీలో స్థానిక ఎన్నికలపై తీర్పును ఇచ్చింది.

ఎస్ఈసీ వేసిన రిట్ అప్పీల్ పిటీషన్ ను హైకోర్టు అనుమతించింది. వ్యాక్సినేషన్ కు ఎన్నికలు అడ్డుకాదని ఎస్ఈసీ వాదించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ వల్ల ఎన్నికలు నిర్వహించలేమని ఇప్పటికే ప్రభుత్వం తరుఫున వాదించారు. అయితే నిమ్మగడ్డ వాదనే నెగ్గి ఏపీలో ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్