https://oktelugu.com/

ఏపీ డీజీపీ ఇంటిపై డ్రోన్ కెమెరాలు.. ఎగురవేసింది ఎవరు?

ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ఇంటిపై కొంతమంది డ్రోన్లు ఎగురవేయడం కలకలం రేపింది. హైదరాబాద్ లోని ఆయన ఇంటిపై భాగంలో ఇవి ఎగురవేసినట్టు గుర్తించారు. ఇంటికి సంబంధించిన దృశ్యాలు చిత్రీకరించారని.. ఫొటోలు తీశారని అనుమానిస్తున్నారు. Also Read: పాదయాత్రలకు ధీటుగా ‘బండి’ యాత్ర..! గతంలో పలువురు నాయకుల ఇళ్లపై డ్రోన్ కెమెరాలు కలకలం రేపాయి. ఏపీలో మాజీ సీఎం చంద్రబాబు నివాసంపై కూడా డ్రోన్ కెమెరాలు ఎగురవేశారు. దీనిపై టీడీపీ నేతలు అప్పట్లో డీజీపీపై దుమ్మెత్తిపోశారు. అయితే […]

Written By:
  • NARESH
  • , Updated On : December 24, 2020 5:34 pm
    Follow us on

    AP DGP

    ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ఇంటిపై కొంతమంది డ్రోన్లు ఎగురవేయడం కలకలం రేపింది. హైదరాబాద్ లోని ఆయన ఇంటిపై భాగంలో ఇవి ఎగురవేసినట్టు గుర్తించారు. ఇంటికి సంబంధించిన దృశ్యాలు చిత్రీకరించారని.. ఫొటోలు తీశారని అనుమానిస్తున్నారు.

    Also Read: పాదయాత్రలకు ధీటుగా ‘బండి’ యాత్ర..!

    గతంలో పలువురు నాయకుల ఇళ్లపై డ్రోన్ కెమెరాలు కలకలం రేపాయి. ఏపీలో మాజీ సీఎం చంద్రబాబు నివాసంపై కూడా డ్రోన్ కెమెరాలు ఎగురవేశారు. దీనిపై టీడీపీ నేతలు అప్పట్లో డీజీపీపై దుమ్మెత్తిపోశారు. అయితే వరద పరిస్థితిని అంచనావేయడానికే ఈ డ్రోన్ ఎగురవేసినట్టు డీజీపీ స్పష్టం చేశారు. అప్పట్లో ఈ వ్యవహారం రాజకీయంగా పెద్ద రచ్చ అయ్యింది.

    తెలంగాణలోని పలువురు పోలీస్ ఉన్నతాధికారుల ఇళ్లపై డ్రోన్ కెమెరాలు ఎవరో ఎగురవేసినట్టు గుర్తించారు.. తెలంగాణ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అదనపు డీజీ రవి గుప్తా, ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇళ్లపై డ్రోన్ కెమెరాలతో కొందరు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ డ్రోన్ కెమెరాల వ్యవహారంపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఆయా పోలీసు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.

    Also Read: కేంద్రం చేతిలో జగన్‌ కీలుబొమ్మ.. అందుకేనా..!

    డ్రోన్ కెమెరాను ఎగురవేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో వీరంతా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో పనిచేసిన పోలీసులు కావడం విశేషం. ఈ కెమెరాను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు.

    అయితే వీరు డ్రోన్ కెమెరాను ఎగురవేయడం వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్