https://oktelugu.com/

పాన్ ఇండియా దర్శకులకు ప్రభాసే కావాలట!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా ప్రకటిస్తే చాలు సంచలనమై కూర్చుంటుంది. ఆయన ప్రకటించే చిత్రాలు భారీ స్థాయిలో ఉంటుండగా, దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ తో పాటు, చేయాల్సిన మరో మూడు చిత్రాల బడ్జెట్ కలిపితే వెయ్యి కోట్లు దాటిపోతుంది. దేశంలో మరే ఇతర హీరో ఈ రేంజ్ లో చిత్రాలు చేయడం లేదు. రాధే శ్యామ్ మూవీ తరువాత దర్శకుడు నాగ్ అశ్విన్ తో ప్రభాస్ ఓ చిత్రాన్ని […]

Written By:
  • admin
  • , Updated On : December 24, 2020 / 12:10 PM IST
    Follow us on


    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా ప్రకటిస్తే చాలు సంచలనమై కూర్చుంటుంది. ఆయన ప్రకటించే చిత్రాలు భారీ స్థాయిలో ఉంటుండగా, దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ తో పాటు, చేయాల్సిన మరో మూడు చిత్రాల బడ్జెట్ కలిపితే వెయ్యి కోట్లు దాటిపోతుంది. దేశంలో మరే ఇతర హీరో ఈ రేంజ్ లో చిత్రాలు చేయడం లేదు. రాధే శ్యామ్ మూవీ తరువాత దర్శకుడు నాగ్ అశ్విన్ తో ప్రభాస్ ఓ చిత్రాన్ని ప్రకటించారు. నిర్మాత అశ్వినీ దత్ రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించారు.

    Also Read: మర్డర్ మూవీ రివ్యూ: ఈసారి ప్రేక్షకులు ‘మర్డర్’ కాలేదు

    ఆ మూవీ తరువాత దర్శకుడు ఓం రౌత్ తో ఆదిపురుష్ మూవీ ప్రకటన వచ్చింది. ఈ మైథలాజికల్ మూవీలో ప్రభాస్ రాముడుగా కనిపించనున్నారు. మొదటిసారి ప్రభాస్ పౌరాణిక పాత్ర చేస్తుండగా విపరీతమైన అంచనాలు ఈ ప్రాజెక్ట్ పై ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్ట్స్ ని మించిన క్రేజీ ప్రాజెక్ట్ మరొకటి ప్రకటించారు ప్రభాస్. కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో సలార్ చేస్తున్నట్లు తెలియజేశారు. హోమబుల్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయడం విశేషం. ఒకటికి మించిన మరొక సంచలన ప్రాజెక్ట్స్ ప్రకటించిన ప్రభాస్ తన ఇమేజ్ ఏ స్థాయిలో ఉందో తెలియజేశారు.

    Also Read: సోహెల్‌కు సినిమా ఆఫర్‌‌.. రేపే ప్రకటిస్తారట

    అన్నీ భారీ పాన్ ఇండియా చిత్రాలు కావడంతో ప్రభాస్ మరో ఐదేళ్ల వరకు మరో దర్శకుడికి దొరక్కపోవచ్చని టాక్ వినిపిస్తుంది. ఇక టాలీవుడ్ దర్శకులకు ప్రభాస్ తో మూవీ చేసే అవకాశం ఇప్పట్లో రాకపోవచ్చు. దేశవ్యాప్తంగా బడాబడా దర్శకులు ప్రభాస్ కోసం పాన్ ఇండియా సబ్జక్ట్స్ సిద్ధం చేసుకొని ఉన్నారు. మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ ప్రభాస్ తో మూవీ చేయాలని గట్టిప్రయత్నాల్లో ఉన్నారట. మంచి దర్శకుడు, కథ దొరికితే సినిమా చేద్దామని, ప్రభాస్ వాళ్లకు హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇక బాహుబలి తరువాత నుండి రెండేళ్లకు ఒక సినిమా చేస్తున్నారు ప్రభాస్. 2019లో సాహో విడుదల చేసిన ప్రభాస్ 2021లో రాధే శ్యామ్ తో పలకరించనున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్