Dil Raju Political Entry : రాజకీయాల్లోకి దిల్ రాజు.. ఏ పార్టీ, ఎక్కడి నుంచి అంటే?

Dil Raju Political Entry : టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అడుగులు రాజకీయాల వైపు పడుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆయన మాటలు చూస్తే అదే అనిపిస్తోంది. తనకు రాజకీయాల్లోకి రావాలని ఆఫర్లు వచ్చాయని దిల్ రాజు సంచలన ప్రకటన చేశారు. దీంతో ఆయన ఏ పార్టీలో చేరుతారా? ఎక్కడి నుంచి పోటీచేస్తారన్న ఆసక్తి నెలకొంది. దిల్ రాజు స్వస్థలం నిజామాబాద్. అక్కడ పుట్టి పెరిగిన ఆయన ఆయన హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. ఇప్పటికీ నిజామాబాద్ […]

Written By: NARESH, Updated On : April 4, 2023 3:46 pm
Follow us on

Dil Raju Political Entry : టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అడుగులు రాజకీయాల వైపు పడుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆయన మాటలు చూస్తే అదే అనిపిస్తోంది. తనకు రాజకీయాల్లోకి రావాలని ఆఫర్లు వచ్చాయని దిల్ రాజు సంచలన ప్రకటన చేశారు. దీంతో ఆయన ఏ పార్టీలో చేరుతారా? ఎక్కడి నుంచి పోటీచేస్తారన్న ఆసక్తి నెలకొంది.

దిల్ రాజు స్వస్థలం నిజామాబాద్. అక్కడ పుట్టి పెరిగిన ఆయన ఆయన హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. ఇప్పటికీ నిజామాబాద్ కు రాకపోకలు సాగిస్తుంటారు. ఆయన రెండో పెళ్లి కూడా నిజామాబాద్ లోనే జరిగింది.

ఈక్రమంలోనే వరుస సినిమాలు, ప్రమోషన్లతో బిజీగా ఉన్న దిల్ రాజుకు తాజాగా రాజకీయాల్లోకి రావాలని ఆఫర్ వచ్చిందట.. కానీ ఆయన మాత్రం ఎంట్రీపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేనని తెలిపారు.

ఇటీవల బలగం సినిమా ప్రమోషన్ లో భాగంగా సిరిసిల్లకు వచ్చిన దిల్ రాజును స్వయంగా కేటీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. అప్పుడు కూడా నవ్వి ఊరుకున్న దిల్ రాజు స్పందించలేదు. కానీ ఇప్పుడు స్పందించడంతో ఆయన పార్టీ, పోటీపై క్లియర్ కట్ గా ఉన్నట్టు తెలుస్తోంది.

దిల్ రాజు నిజామాబాద్ ఎంపీ సీటును ఆశిస్తున్నారు. కానీ ఇక్కడి నుంచి టీఆర్ఎస్ నుంచి కవిత, బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్ ఉన్నారు. ఇద్దరూ బలమైన అభ్యర్థులు. సో తన సొంత జిల్లాలో దిల్ రాజుకు సీటు దక్కడం కష్టమే. అందుకే కొద్దిరోజులు వేచిచూద్దాం అన్నట్టుగా దిల్ రాజు చూస్తున్నాడు. ఒకవేళ కవిత కనుక నిజామాబాద్ లో పోటీచేయకుండా విరమిస్తే దిల్ రాజును ఆస్థానంలో బీఆర్ఎస్ దింపే అవకాశాలు ఉంటాయి. ఆ క్లారిటీ లేదు కాబట్టే దిల్ రాజు ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నాడని అంటున్నారు.