
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ కొన్ని రోజుల క్రితం పెళ్లి చేసుకోబోతున్నట్టు కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను ఈ నెల 30వ తేదీన కాజల్ పెళ్లి చేసుకోనుంది. 2007లో లక్ష్మీ కళ్యాణం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కాజల్ పెళ్లి చేసుకోతుందని గతంలోనే ఆ వార్తలు వచ్చినా ఆ వార్తలు అబద్ధమని తేలింది. అయితే లాక్ డౌన్ వల్ల కెరీర్ లో కొంత గ్యాప్ రావడంతో పెళ్లి చేసుకోవడానికి ఇదే సమయమని భావించి కాజల్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
అయితే కాజల్ పెళ్లి గ్రాండ్ గా హోటల్ లో జరగబోతుందని మొదట వార్తలు వచ్చాయి. అయితే కరోనా, లాక్ డౌన్ వల్ల కాజల్ పెళ్లి విషయంలో నిర్ణయం మార్చుకుంది. చాలా తక్కువమంది స్నేహితులు, బంధువుల మధ్య కుటుంబ సభ్యులతో కలిసి చిన్నగా వివాహ వేడుకను జరుపుకోబోతున్నానని కాజల్ వెల్లడించింది. సింపుల్ గా తనకు పెళ్లి జరగడం ఎంతో థ్రిల్లింగ్ గా ఉందని కాజల్ అభిప్రాయపడింది.
తమ వివాహ వేడుకను అతి జాగ్రత్తగా సెలబ్రేట్ చేసుకోబోతున్నామని కాజల్ వెల్లడించారు. కాజల్ పెళ్లి వేడుక ముంబైలోని ఆమె ఇంట్లోనే జరగనుందని తెలుస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలు ఎవరూ ఈ వివాహ వేడుకకు హాజరు కావడం లేదని సమాచారం. అయితే పెళ్లి కుటుంబ సభ్యుల మధ్యే రిసెప్షన్ మాత్రం గ్రాండ్ గా చేసుకోవాలని కాజల్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రిసెప్షన్ వద్దని కొందరు కాజల్ కు సూచించినట్టు సమాచారం.
పెళ్లి తరువాత కూడా కాజల్ సినిమాల్లో నటించనుంది. కాజల్ సినిమాల్లో నటించడంపై పెళ్లికొడుకు కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేవని సమాచారం. వచ్చే నెలలో కాజల్ హనీమూన్ ను ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.