Homeఎంటర్టైన్మెంట్Dhurandhar: 'ధురంధర్' లో చూసిన క్యారెక్టర్స్ నిజ జీవితంలో వీళ్ళే..ఒక్కొక్కరి చరిత్ర చూస్తే వెన్నులో వణుకుపుడుతుంది!

Dhurandhar: ‘ధురంధర్’ లో చూసిన క్యారెక్టర్స్ నిజ జీవితంలో వీళ్ళే..ఒక్కొక్కరి చరిత్ర చూస్తే వెన్నులో వణుకుపుడుతుంది!

Dhurandhar: ‘ధురంధర్'(Dhurandhar Movie) చిత్రం విడుదలై నేటితో రెండు నెలలు పూర్తి అయ్యింది. మూడు రోజుల క్రితం ఓటీటీ లో కూడా విడుదలైంది. అయినప్పటికీ ఈ సినిమా థియేటర్స్ లో రన్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఆడియన్స్ చూపు మొత్తం ‘ధురంధర్ 2 : ది రివెంజ్’ వైపే ఉంది. నేడు ఉదయం ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని విడుదల చేయగా, దానికి తెలుగు ఆడియన్స్ నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా మన భర్త దేశం లో జరిగిన టెర్రరిస్ట్స్ అటాక్స్ ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ లో టెర్రరిస్ట్ మూకల కదలికలను ఇండియా కి చేరవేసేందుకు స్పైలను ఆ దేశానికీ మన తరుపున పంపి, మనం వేసే అడుగుల ఆధారంగా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దారు.

ఈ సినిమాలో చూపించిన పాత్రలు నిజ జీవితం లో ఉన్నవే. ఈ చిత్రం లో ప్రముఖ హీరో మాధవన్ పోషించిన అజయ్ సన్యాల్ పాత్ర మరెవరిదో కాదు, మన దేశానికీ ప్రస్తుతం నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా వ్యవహరిస్తున్న అజిత్ దోవల్ నే. అదే విధంగా ల్యారీ నగరాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని ఇసరాజ్యం గా వ్యవహరించిన రెహ్మాన్ డెకాయిట్ పాత్ర ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ పాత్రని అక్షయ్ ఖన్నా ఎంత అద్భుతంగా పోషించాడో మనమంతా చూసాము. ఈ పాత్ర కూడా నిజ జీవితం లోని పాత్రనే అట. ల్యారీ లోకల్ గ్యాంగ్ స్టర్ ‘సర్దార్ అబ్దుల్ రెహ్మాన్ బలోచ్’ పాత్రనే ఇందులో చూపించారు. రెహమాన్ బలోచ్ ల్యారీ నగరాన్ని మాత్రమే కాదు, కరాచీ నగరాన్ని కూడా తన గుప్పిట్లో పెట్టుకునేవాడు. లోకల్ జనాలకు ఆయన ఒక రాబిన్ హుడ్ టైపు. అడిగినంత డబ్బులు ఇచ్చేవాడు.

కానీ అక్రమ పనులు చాలానే చేసేవాడు. ISI ఉగ్రవాదులకు మారణాయుధాలను ఇవ్వడం, నకిలీ నోట్లను ఇండియా కి పంపడం, తన దందాకు అడ్డు వచ్చినా ఎవరినైనా అతి నీచంగా చంపడం వంటివి చాలానే చేసాడు. అతని పేరు పలకడానికే ప్రత్యర్థులు భయపడే వారు. అలాంటి వ్యక్తికీ ఎదురు వెళ్లిన మనిషి ఎస్పీ చౌదరి. సంజయ్ దత్ పోషించిన ఈ పాత్ర కూడా నిజ జీవితం లోనిదే. నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. రెహమాన్ బలోచ్ లాంటి గ్యాంగ్ స్టర్స్ కి సింహ స్వప్నం లాంటి వాటివాడు. ఇతనే రెహమాన్ బలోచ్ ని ఎన్కౌంటర్ చేసి చంపేశాడు. ఇక అర్జున్ రాంపాల్ పోషించిన మేజర్ ఇక్బాల్ క్యారక్టర్ ISI కి చెందిన మిలిటెంట్ ఇలియాస్ కాశ్మీరీ అనే వ్యక్తి పాత్ర. ఇక హీరో రణవీర్ సింగ్ పోషించిన హంజా అలీ మజారీ క్యారక్టర్ ని ఇండియన్ స్పై మోహిత్ శర్మ ని ఆధారంగా తీసుకొని రాసారని టాక్. ఇలా నిజ జీవితం లోని క్యారెక్టర్స్ నే వెండితెర పై చూపించారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular