Dacoit Movie Pre Rrelease Business: సుమారుగా నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అడివి శేష్(Adivi Sesh) హీరోగా నటించిన ‘డెకాయిట్'(Dacoit Movie) చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడంతో , ee సినిమా పై యూత్ ఆడియన్స్ లో హైప్ మామూలు రేంజ్ లో లేదు. అన్ని సినిమాలకు లాగానే ఈ చిత్రానికి కూడా నేడు ప్రీమియర్ షోస్ పడుతాయని ఆశించారు. కానీ మేకర్స్ మాత్రం రేపు ఉదయం 8 గంటల ఆట నుండే ఈ చిత్రాన్ని ప్రారంభించాలని అనుకున్నారు. ఇకపోతే ఈ చిత్రం తో అడివి శేష్ డబుల్ డిజిట్ గ్రాస్ ఓపెనింగ్ ని అందుకోబోతున్నాడని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి బుక్ మై షో , డిస్ట్రిక్ట్ యాప్స్ ద్వారా 2 కోట్ల 77 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చినట్టు తెలుస్తోంది .
వీటితో పాటు ఓవర్సీస్ + కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి ఈ చిత్రానికి 6 కోట్ల రూపాయిల రేంజ్ అడ్వాన్స్ గ్రాస్ నమోదు అయ్యిందని , కచ్చితంగా మొదటి రోజే ఈ చిత్రం 10 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లను రాబడుతుందని, పాజిటివ్ టాక్ వస్తే ఈ లెక్క ఇంకా బాగా పెరగొచ్చని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక విడుదలకు ముందు ee చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చాలా బలంగానే జరిగింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని పొంది సూపర్ హిట్ స్టేటస్ ని చేరుకోవాలంటే 55 కోట్ల గ్రాస్ వసూళ్ల మార్కుని అందుకోవాలి . చాలా పెద్ద టార్గెట్ ఇది. కానీ పాజిటివ్ టాక్ వస్తే పెద్ద కష్టమేమి కాదని అంటున్నారు.
55 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావాలంటే, దాదాపుగా 25 కోట్ల రూపాయలకు పైగానే షేర్ వసూళ్లను రాబట్టాలి. మరి ఆ రేంజ్ ఈ సినిమాకు ఉందా లేదా అనేది మరికొద్ది గంటల్లోనే తెలియబోతుంది. జనాలు ప్రస్తుతం మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు . అందుకే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేయొచ్చని అంటున్నారు. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ఏమిటంటే , ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే, వీకెండ్ ki 40 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు. మరి ఆ రేంజ్ కి చేరుకుంటుందో లేదో చూడాలి.